NIEPID Job Notification 2023 : ఎన్‌ఐఈపీఐడీలో 46 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ

ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబరు 18లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

NIEPID Job Notification 2023 : ఎన్‌ఐఈపీఐడీలో 46 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ

NIEPID Job Notification 2023

NIEPID Job Notification 2023 : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగజన్) సికింద్రాబాద్‌లో లెక్చరర్, ఎంటీఎస్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబరు 18లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

READ ALSO : ITPO Recruitment 2023 : ITPO యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ.. జీతం రూ. 60,000

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు ;

ఎన్‌ఐఈపీఐడీ- సికింద్రాబాద్ ఖాళీల వివరాలు ;

లెక్చరర్( స్పెషల్ ఎడ్యుకేషన్): 01 పోస్టు ఉండగా, దరఖాస్తు చేసుకునే వారి అర్హతకు సంబంధించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఒక సంవత్సరం డిప్లొమా, బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్‌ ఆఫ్ మెంటల్లీ రిటార్డెడ్ కలిగి ఉండాలి. వయోపరిమితి 45 సంవత్సరాలు లోపు ఉండాలి.

లెక్చరర్( రీహాబిలిటేషన్ సైకాలజీ): 01 పోస్టు ఉండగా అర్హతలు NIMHANS, బెంగళూరు, సీఐపీ, రాంచీ లేదా ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్ మొదలైన సంస్థల నుంచి క్లినికల్ / రిహాబిలిటేషన్ సైకాలజీలో రెండేళ్ల ఎంఫిల్ కలిగి ఉండాలి. పీహెచ్‌డీ(చైల్డ్ / ఎక్స్‌పరీమెంటల్ కమ్యూనిటీ / ఎడ్యుకేషనల్ సైకాలజీ) పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 45 సంవత్సరాలు లోపు ఉండాలి.

రీహాబిలిటేషన్ ఆఫీసర్: 01 పోస్టు ఉండగా అర్హత విషయానికి వస్తే సంబధిత విభాగంలో పీజీ డిగ్రీతో పాటు 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 45 సంవత్సరాలు ఉండాలి.

READ ALSO : SSC Job Calendar 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024లో భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవే !

స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01 పోస్టు ఉండగా అర్హతకు సంబంధించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలు ఉండాలి.

రిసెప్షనిస్ట్-కమ్ టెలిఫోన్ ఆపరేటర్: 01 పోస్టు ఉండగా అర్హతకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఆంగ్లంలో టైపింగ్ వేగం 30 wpm లేదా మాన్యువల్ టైప్‌రైటర్‌పై హిందీలో 25 wpm. ఉండాలి. వయోపరిమితి 18-28 సంవత్సరాలు ఉండాలి.

డ్రైవర్: 02 పోస్టులు ఉండగా అర్హత విషయానికి వస్తే 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మోటారు మెకానిజంకి సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల పాటు మోటారు కారును నడిపిన అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలు ఉండాలి.

ఎంటీఎస్(అటెండర్): 01 పోస్టు ఉండగా, అర్హతకు సంబంధించి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి18-25 సంవత్సరాలు ఉండాలి.

READ ALSO : Constable Posts : పదో తరగతి పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఎన్‌ఐఈపీఐడీ- నోయిడా ఖాళీల వివరాలు ;

డ్రైవర్: 01 పోస్టు ఉండగా అర్హతకు సంబంధించి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మోటారు మెకానిజంకి సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల పాటు మోటారు కారును నడిపిన అనుభవం ఉండాలి . వయోపరిమితి 35 సంవత్సరాలు ఉండాలి.

ఎంటీఎస్(ఆయా): 01 పోస్టు ఉండగా అర్హత మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆయాగా పని అనుభవం ఉండాలి. CBID సర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18-25 సంవత్సరాలు ఉండాలి.

ఎన్‌ఐఈపీఐడీ- నవీ ముంబయి ఖాళీల వివరాలు ;

ఎంటీఎస్(అటెండర్): 01 పోస్టు ఉండగా అర్హత విషయానికి వస్తే మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి 18-25 సంవత్సరాలు ఉండాలి.

READ ALSO : Electric Air Taxi : ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఎగరనున్నాయి…2026వ సంవత్సరంలో ప్రయాణికులకు సేవలు

కాంట్రాక్ట్ పోస్ట్‌ల ఖాళీల వివరాలు ;

ఎన్‌ఐఈపీఐడీ- సికింద్రాబాద్ ఖాళీలు ;

అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్): 01 పోస్టు ఉండగా అర్హత పీడియాట్రిక్స్‌లో ఎండీ కలిగి ఉండాలి. సంబధిత విభాగంలో నాలుగు సంవత్సరాల బోధన లేదా పరిశోధన అనుభవం ఉండాలి. వయోపరిమితి 56 సంవత్సరాలు మించరాదు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్): 01 పోస్టు ఉండగా అర్హతకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. సూపర్‌వైజరీ కెపాసిటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఐదేళ్ల అనుభవంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై అవగాహన ఉండాలి. వయోపరిమితి 56 సంవత్సరాలు మించరాదు.

READ ALSO : Boiled Egg Vs Omelette : ఉడకబెట్టిన గుడ్డు Vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచిది? ఇలా తెలుసుకోండి..

సీఆర్‌సీ- దావణ్‌గెరె ఖాళీలు ;

అసిస్టెంట్ ప్రొఫెసర్(PMR): 01 పోస్టు ఉండగా అర్హతకు సంబంధించి ఎంబీబీఎస్, ఎంసీఐ/ఆర్‌సీఐ ద్వారా గుర్తించబడిన పీఎంఆర్/పీడియాట్రిక్స్‌లో పీజీడిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో బోధన లేదా పరిశోధనలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 56 సంవత్సరాలు మించరాదు.

వర్క్‌షాప్ సూపర్‌వైజర్-కమ్ స్టోర్ కీపర్: 01 పోస్టు ఉండగా, అర్హతలకు సంబంధించి 10+2 లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ప్రోస్తేటిక్స్ & ఆర్థోటిక్స్‌లో డిప్లొమా / సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత ప్రాంతంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 56 సంవత్సరాలు మించరాదు.

READ ALSO : Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరి దీపం .. నవగ్రహ దోషాల హరణం

సీఆర్‌సీ- నెల్లూరు ఖాళీలు ;

అసిస్టెంట్ ప్రొఫెసర్(PMR): 01 పోస్టు ఉండగా అర్హత విషయానికి వస్తే ఎంబీబీఎస్, ఎంసీఐ/ఆర్‌సీఐ ద్వారా గుర్తించబడిన పీఎంఆర్/పీడియాట్రిక్స్‌లో పీజీడిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో బోధన లేదా పరిశోధనలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి 56 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం:

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

READ ALSO : Delay in Pregnancy : గర్భధారణలో అలస్యమా ! అలాంటి సమయంలో ఏంచేయాలి.. నిపుణుల సూచనలు ఇవే ?

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Director, NIEPID, Manovikas Nagar, Secunderabad-500009.

దరఖాస్తుకు చివరితేదిగా 18.12.2023 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.niepid.nic.in/ పరిశీలించగలరు.