Constable Posts : పదో తరగతి పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలు

కానిస్టేబుల్ గ్రౌండ్ డ్యూటీ రాత పరీక్షలను ఫిబ్రవరి 20, 2024 నుండి విడల వారీగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 20,21,22,2324,26,27,28,29, మార్చి 1,5,6,7,11,12 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు

Constable Posts : పదో తరగతి పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలు

constable jobs

Constable Posts : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది నిజంగానే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలోని సాయుధ బలగాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా వేల సంఖ్యలో ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికిసంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుల చేయటానికి రంగం సిద్ధమౌతుంది.

READ ALSO : Bengaluru : చెత్తకుప్పలో బయటపడ్డ అమెరికా డాలర్ల నోట్ల కట్టలు .. తీసుకెళ్లి యజమానికి అప్పగించిన వ్యక్తి

నోటిఫికేషన్ వెల్లడికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తుంది. ఎస్ఎస్సీ వార్షిక జాబ్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెల్లడించాల్సి ఉంటుంది.

పోస్టులు, విద్యార్హత ;

కానిస్టేబుల్ గ్రౌండ్ డ్యూటీ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.

READ ALSO : Gold Rate Today : శుభవార్త .. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు,తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు గోల్డ్ ధర ఎంతంటే?

ఖాళీలకు సంబంధించిన విభాగాలు ;

ఐటీబీపీ

ఎస్ఎస్బీ

బీఎస్ఎఫ్

సీఐఎస్ఎఫ్

సీఆర్పీఎఫ్

ఎన్సీబీ సిపాయి

ఎస్ఎస్ఎఫ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)

అస్సాం రైఫిల్స్ రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ

READ ALSO : SSC Job Calendar 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024లో భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవే !

ఎంపిక ప్రక్రియ ;

రాతపరీక్ష

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్

వైద్య పరీక్షలు

డాక్యుమెంట్స్ వెరిఫికేషన్

రిజర్వేషన్ పరిశీలన

READ ALSO : Mumbai Street : ముంబయి వీధిలో మహిళ ప్రసవం…పోలీసులు వచ్చి ఏం చేశారంటే…

పరీక్ష తేది ;

కానిస్టేబుల్ గ్రౌండ్ డ్యూటీ రాత పరీక్షలను ఫిబ్రవరి 20, 2024 నుండి విడల వారీగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 20,21,22,2324,26,27,28,29, మార్చి 1,5,6,7,11,12 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

READ ALSO : Electric Air Taxi : ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఎగరనున్నాయి…2026వ సంవత్సరంలో ప్రయాణికులకు సేవలు

ముఖ్యమైన తేదీల వివరాలు ;

నవంబర్ 24, 2023న నోటిఫికేషన్ విడుదల ఉంటుంది.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా డిసెంబర్ 28, 2023గా నిర్ణయించారు.

దరఖాస్తు చేసుకునేందుకు , దీంతోపాటు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఎస్ ఎస్ సీ అధికారిక వెబ్ సైట్ ; https://ssc.nic.in/ పరిశీలించగలరు.