Mumbai Street : ముంబయి వీధిలో మహిళ ప్రసవం…పోలీసులు వచ్చి ఏం చేశారంటే…
ముంబయి నగర వీధిలో ఓ నిండు గర్భిణీ ప్రసవించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి నగరంలోని కామానీ జంక్షన్ సమీపంలోని వీధిలోనే 30 ఏళ్ల గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది....

Woman gives birth
Mumbai Street : ముంబయి నగర వీధిలో ఓ నిండు గర్భిణీ ప్రసవించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి నగరంలోని కామానీ జంక్షన్ సమీపంలోని వీధిలోనే 30 ఏళ్ల గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వీధిలో మహిళ ప్రసవించిందని ముంబయి వీబీ నగర్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన వచ్చి బిడ్డ, తల్లిని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతున్న ఆసుపత్రికి తరలించారు.
Also Read : Electric Air Taxi : ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఎగరనున్నాయి…2026వ సంవత్సరంలో ప్రయాణికులకు సేవలు
సువర్ణ మిర్గాల్ అనే 30 ఏళ్ల మహిళ కామానీ జంక్షన్ వద్ద వీధిలోనే బహిరంగంగా ప్రసవించి స్పృహ కోల్పోయిందని పోలీసులు చెప్పారు. తల్లీ, బిడ్డలకు సకాలంలో ఆసుపత్రికి చేర్చి, చికిత్స చేయించడంతో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని పోలీసు అధికారి నిర్భయ్ పాఠక్ చెప్పారు. ఈ మహిళ గర్భం దాల్చడానికి కారణం ఏవరనే విషయమై తాము ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Also Read : Pakistan :పాకిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు…మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా మాజీ కమాండర్ మృతి
శిక్షణ పొందిన పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతీరోజూ పెట్రోలింగ్ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. ఇక ముందు లైంగిక వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎస్ఐ చెప్పారు. గతంలో ముంబయిలోని సాకినాక, అంధేరి ప్రాంతాల్లో మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయి.