Pakistan :పాకిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు…మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా మాజీ కమాండర్ మృతి

భారత వ్యతిరేక ప్రసంగాలకు పేరుగాంచిన లష్కర్ మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను పాకిస్థాన్‌లో ఆగంతకులు కాల్చి చంపారు. లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను పాకిస్థాన్‌లో గురువారం కాల్చి చంపినట్లు పాక్ పోలీసు వర్గాలు తెలిపాయి....

Pakistan :పాకిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు…మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా మాజీ కమాండర్ మృతి

LeT Former commander Akram Khan

Pakistan : భారత వ్యతిరేక ప్రసంగాలకు పేరుగాంచిన లష్కర్ మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను పాకిస్థాన్‌లో ఆగంతకులు కాల్చి చంపారు. లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను పాకిస్థాన్‌లో గురువారం కాల్చి చంపినట్లు పాక్ పోలీసు వర్గాలు తెలిపాయి. అక్రమ్ గాజీ అని కూడా పిలిచే అక్రమ్ ఖాన్‌ను ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

Also Read : Electric Air Taxi : ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఎగరనున్నాయి…2026వ సంవత్సరంలో ప్రయాణికులకు సేవలు

2018వ సంవత్సరం నుంచి 2020 వరకు లష్కరే తోయిబా రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించిన గాజీ పాకిస్థాన్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. ఈయన తీవ్రవాద గ్రూపునకు చెందిన ప్రముఖ వ్యక్తి. అక్రమ్ ఖాన్ చాలా కాలంగా తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అక్రమ్ తీవ్రవాద కారణాల పట్ల సానుభూతిగల వ్యక్తులను గుర్తించి, వారిని ఉగ్రవాద సంస్థలో రిక్రూట్ చేశారు.

Also Read : Manushi Chhillar : వెండి చీరలో మెరిసిన అందాలరాశి…మానుషి ఛిల్లార్‌ను చూద్దాం రండి

ఈ ఏడాది అక్టోబర్‌లో పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ ను పాకిస్థాన్‌లో కాల్చి చంపారు. లతీఫ్ స్వస్థలం పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలా నగరం. భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడైన లతీఫ్ 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి చొరబడ్డాడు.

Also Read : Delhi Artificial Rain : ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం రూ.13కోట్ల ఖర్చు…నేడు సుప్రీం అనుమతి కోరనున్న సర్కారు

సెప్టెంబరులో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్‌కోట్‌లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. ఉగ్రవాదిని రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌గా గుర్తించారు. రియాజ్ అహ్మద్ ప్రార్థనలు చేయడానికి కోట్లి నుంచి వచ్చాడు. అతన్ని పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో తలపై కాల్చారు.