Delhi Artificial Rain : ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం రూ.13కోట్ల ఖర్చు…నేడు సుప్రీం అనుమతి కోరనున్న సర్కారు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిసే అవకాశాలపై చర్చించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది....

Delhi Artificial Rain : ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం రూ.13కోట్ల ఖర్చు…నేడు సుప్రీం అనుమతి కోరనున్న సర్కారు

Delhi Artificial Rain : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిసే అవకాశాలపై చర్చించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రయోగాత్మక అధ్యయనానికి రూ.13 కోట్ల ఖర్చును ఢిల్లీ నగర ప్రభుత్వం భరిస్తుందని అధికారులు చెప్పారు. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు ముందు అఫిడవిట్ ద్వారా తమ కృత్రిమ వర్షాలు కురిపించే ప్రతిపాదనను సమర్పించాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఢిల్లీ నగర ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

Also Read : Mumbai : టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం…ముగ్గురి మృతి, ఆరుగురికి గాయాలు

నవంబర్ 20, 21 తేదీల్లో మొదటి దశ కృత్రిమ వర్షంపై ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు వీలుగా నవంబర్ 15వతేదీలోగా కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందాలని సుప్రీంకోర్టును కోరాలని కూడా చీఫ్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. బుధవారం పర్యావరణ మంత్రి ఐఐటి కాన్పూర్‌కు చెందిన బృందంతో సమావేశమై నగరంలో కృత్రిమ వర్షం కురిపించే అవకాశాలపై చర్చించారు.

మేఘావృతం అయితేనే కృత్రిమ వర్షాలు

సమావేశం అనంతరం మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. నవంబర్ 20-21 తేదీల్లో ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటే కృత్రిమ వర్షం కురిపించవచ్చన్నారు. కృత్రిమ వర్షాలు కురిపించడానికి కనీసం 40 శాతం మేఘాలు అవసరమని కాన్పూర్ ఐఐటీ నిపుణులు చెప్పారు. నవంబర్ 20,21 తేదీల్లో ఢిల్లీలో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. ఢిల్లీలో మొత్తం గాలి నాణ్యత శుక్రవారం ఉదయం తీవ్ర కేటగిరీలోనే కొనసాగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత సూచిక 421 వద్ద నమోదైంది.

ఢిల్లీలో ఆకస్మికంగా మారిన వాతావరణం…తేలికపాటి వర్షం

ఒక వైపు ఢిల్లీలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా మరో వైపు శుక్రవారం తెల్లవారుజామున వాతావరణం ఆకస్మికంగా మారింది. వాయు కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురిసింది. కర్తవ్యపథ్, ఢిల్లీ,నోయిడా సరిహద్దుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. వాయుకాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు తేలికపాటి వర్షం కురవడంతో ఊరట చెందారు.

కాలుష్య నియంత్రణకు రంగంలోకి దిగిన మంత్రులు

ఢిల్లీలో అలముకున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షాలు కురిపించాలని ఢిల్లీ సర్కారు యోచిస్తోంది. ఢిల్లీ మంత్రులు రంగంలోకి దిగి కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టారు. పెరుగుతున్న వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు సర్కారు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తోంది.