Jawahar Navodaya: నవోదయ అడ్మిషన్ కి ఇంకా అప్లై చేసుకోలేదా.. గడువు ముగుస్తోంది.. ఇలా అప్లై చేసుకోండి వెంటనే
Jawahar Navodaya: జవహర్ నవోదయ విద్యాలయాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను త్వరలో ముగియనుంది.

Navodaya admission deadline ends soon
జవహర్ నవోదయ విద్యాలయాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను త్వరలో ముగియనుంది. 6వ తరగతి ప్రవేశాల కోసం జరిగే ఈ పరీక్ష దరఖాస్తు గడువు జూలై 29తో ముగియనుంది. కాబట్టి ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే ఈ cbseitms.rcil.gov.in/nvs వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్, తల్లిదండ్రుల సంతకం, అభ్యర్థి సంతకం, ఆధార్, నివాస ధృవీకరణ పత్రం, తదితర పత్రాలు దరఖాస్తు కోసం అవసరమవుతాయి. ఇక దీనికి సంబందించిన పరీక్షా రెండు దశలుగా జరుగుతుంది.
మొదటి పరీక్ష:
మొదటి దశ పరీక్ష డిసెంబర్ 13 శనివారం జరగనుంది. ఇది JNVST ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ పశ్చిమ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాదర్ అండ్ నాగర్ హవేలి, డామన్ అండ్ డయు, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహిస్తారు.
రెండవ పరీక్ష:
ఈ పరీక్ష ఏప్రిల్ 11, 2026 శనివారం జరుగుతుంది. ఇది జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయ, తవాంగ్ జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కిన్నౌర్, మండి,లాహౌల్ అండ్ స్పితి, సోలన్, సిమ్లా జిల్లాలు, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా, లడఖ్‌లోని లెహ్ అండ్ కార్గిల్ జిల్లాలలో జరుగుతుంది.