NEET UG 2024 : నీట్ యూజీ 2024 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెడికల్ ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీ పొడిగింపు.. ఎప్పటివరకంటే?
NEET UG 2024 : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024)కు సంబంధించి రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించారు. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు మరో అవకాశం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.

Registration Dates Extended For National Eligibility Cum Entrance Test
NEET UG 2024 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024) కోసం దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ తేదీలను పొడిగించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మార్చి 16, 2024 వరకు సమయం ఉంది. దరఖాస్తు ఫారమ్‌లను చివరి తేదీ రాత్రి 10:50 గంటలలోపు సమర్పించవచ్చు. అయితే, దరఖాస్తు చెల్లింపును స్వీకరించడానికి గడువు రాత్రి 11:50 వరకు ఉంటుంది. జనరల్ కేటగిరీ, ఎన్ఆర్ఐ అభ్యర్థులు రూ. 1,700 దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
నీట్ యూజీ పరీక్ష ఫీజు వివరాలు :
అయితే, జనరల్-ఇడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులు రూ. 1,600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 1,000 చెల్లించాలి. దరఖాస్తులో తప్పులను ఎడిట్ చేసుకునే అవకాశం అనేది అడ్మిట్ కార్డ్‌ల విడుదల తేదీ తర్వాత వెబ్‌సైట్‌లో ఎన్టీఏ వెల్లడించనుంది. నీట్ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఫిబ్రవరి 9, 2024న ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్‌ల కోసం గత గడువు మార్చి 9, 2024గా ఎన్టీఏ నిర్ణయించింది. అయితే, నీట్ యూజీ-2024లో మార్పులకు సంబంధించి అభ్యర్థనలు రావడంతో రిజిస్ట్రేషన్‌ల తేదీలను పొడిగించింది.
భారత్ వెలుపుల 14 దేశాల్లో పరీక్షా కేంద్రాలు :
దరఖాస్తు ఫారమ్‌లను పూర్తి చేయడానికి ఎన్‌టిఎ మరో అవకాశాన్ని అందిస్తోందని ఏజెన్సీ పేర్కొంది. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయడంలో తప్పులను నివారించడానికి అభ్యర్థులు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించింది. మే 5, 2024న నీట్ యూజీ 2024 పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా, భారత్ వెలుపల ఉన్న 14 దేశాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు నిర్వహించనున్నారు.
దరఖాస్తు ప్రక్రియకు అవసరమైన డాక్యుమెంట్లు :
- అభ్యర్థి ఇటీవల దిగిన పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్ స్కాన్ చేసి ఉండాలి.
- పోస్ట్‌కార్డ్ సైజు ఫొటో
- ఎడమ, కుడి చేతి వేళ్లు, బొటనవేలి ముద్ర సిగ్నేచర్ ఉండాలి.
- కేటగిరీ సర్టిఫికేట్ (మీకు వర్తిస్తే) ఉండాలి.
- పౌరసత్వ ధృవీకరణ పత్రం ( మీకు వర్తిస్తే)
- పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ (వర్తించే చోట)
- అడ్రస్ ప్రూఫ్ (కరెంట్, పర్మినెంట్ అడ్రస్ )
- లేటెస్ట్ ఫొటో కలర్ లేదా బ్లాక్ అండ్ వైడ్ రంగులో ఉండాలి.
- 80శాతం ఫేస్ మాస్క్ లేకుండా వైట్ బ్యాక్ గ్రౌండ్, చెవులతో సహా స్పష్టంగా కనిపించేలా ఉండాలి.