NLC Recruitment 2023 : ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీ

బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.

NLC Recruitment 2023 : ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీ

NLC Recruitment 2023

NLC Recruitment 2023 : ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీఐఎల్)కడలూరులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 295 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.

READ ALSO : Local Boi Nani : నేను ఏ తప్పూ చేయలేదు,నన్ను నమ్మండి .. మత్స్యకారుల కోసమే వీడియో తీసి పోస్ట్ చేశాను : లోకల్ బాయ్ నాని

వివరాల విషయానికి వస్తే ;

మొత్తం ఖాళీలు: 295

గ్రాడ్యుయేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైయినీ పోస్టులు

థర్మల్ పవర్ స్టేషన్లు & రీన్యూయబల్ ఎనర్జి(ఏరియా-1): 140 ఖాళీలు

మెకానికల్‌: 36

సివిల్: 15

కంప్యూటర్‌: 18

ఎలక్ట్రికల్‌: 71

మైన్స్ & అల్లైడ్ సర్వీసెస్(ఏరియా-2): 155 ఖాళీలు

READ ALSO : NIT Warangal PhD Admission 2023 : వరంగల్‌ నిట్‌ లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు దరఖాస్తు !

సివిల్: 13

మైనింగ్‌: 17

మెకానికల్‌: 84

ఎలక్ట్రికల్‌: 38

కంప్యూటర్‌: 03

READ ALSO : Gangula Kamalakar : ఆంధ్రోళ్లు మళ్లీ వస్తున్నారు.. షర్మిల, పవన్, పాల్‌పై గంగుల సంచలన వ్యాఖ్యలు

అర్హతలు :

సివిల్ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో సివిల్ ఇంజినీరింగ్/సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి.

మెకానికల్‌ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్ధులు కనీసం 60శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్/మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు సాధించాలి.

ఎలక్ట్రికల్‌ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/పవర్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు సాధించి ఉండాలి.

READ ALSO : Qatar Court : 8 మంది మాజీ నావికాదళ సిబ్బందికి మరణశిక్షపై ఊరట.. భారత్ అప్పీల్‌ను అంగీకరించిన ఖతార్ కోర్టు

మైనింగ్‌ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మైనింగ్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు సాధించాలి.

కంప్యూటర్‌ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి.

READ ALSO : Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక కేసులు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ వాయిదా

గరిష్ఠ వయోపరిమితి:

జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు ఫీజు:

జనరల్,ఈడబ్ల్యూఎస్, ఓబీసీ దరఖాస్తు ఫీజు రూ.500 దీంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.354 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.354 దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

READ ALSO : Revanth Reddy : తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. అమిత్ షా, కేసీఆర్ కామన్ ప్లాన్ అర్థం చేసుకోవాలని సూచన

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:

గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

READ ALSO : Pregnancy After 40 : 40 ఏళ్ల తర్వాత గర్భందాల్చటం సురక్షితమా ? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

జీతం:

నెలకు రూ.50,000-రూ.1,60,000 చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 21.12.2023.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nlcindia.in/ పరిశీలించగలరు.