AIIMS Nagpur : ఎయిమ్స్ నాగపూర్ లో నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10+2/ డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంఏ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

AIIMS Nagpur

AIIMS Nagpur : భారత ప్రభుత్వరంగ సంస్థ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నాగపూర్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Chilli Crop : మిరపలో కొమ్మకుళ్లు తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

పోస్టుల వివరాలకు సంబంధించి మెడికల్ ఫిజిసిస్ట్: 02, క్లినికల్ సైకాలజిస్ట్: 01, మెడికల్ ఆఫీసర్ (ఆయుష్): 01, యోగా ఇన్స్ట్రక్టర్:01, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 0, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 04, స్టోర్ కీపర్: 04, జూనియర్ ఇంజినీర్ (ఏసీ & రిఫ్రిజిరేటర్): 01, జూనియర్ ఇంజినీర్ (సివిల్): 01, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01, జూనియర్ ఫిజియోథెరపిస్ట్: 01, జూనియర్ ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్: 02

READ ALSO : Prawn Cultivation : శీతాకాలంలో వనామి రొయ్యలకు వైట్ స్ఫాట్, విబ్రియో ఉధృతి

వీటితోపాటుగా లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01, ఆప్టొమెట్రిస్ట్: 02, టెక్నీషియన్ (ల్యాబొరేటరీ): 16, టెక్నీషియన్ (రేడియోలజీ): 02, ఫార్మసిస్ట్: 05, ఫైర్ టెక్నీషియన్: 02, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్స్: 02, స్టెనోగ్రాఫర్: 04, లాండ్రీ సూపర్వైజర్: 01, జూనియర్ వార్డెన్: 02, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (LDC): 10 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : గోరు వెచ్చని నీరు ఎప్పుడు తాగాలో తెలుసా?

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10+2/ డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంఏ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

READ ALSO : Vinod Kumar : కేసీఆర్‌ను రావొద్దని ఎందుకు చెప్పారు? ప్రధాని మోదీపై వినోద్ కుమార్ ఫైర్

అభ్యర్ధుల ఎంపిక విధానం కంప్యూటర్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే రూ.1000. ఎస్సీ, ఎస్టీలకు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తులను నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుండి 30 రోజుల లోపు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; aiimsnagpur.edu.in పరిశీలించగలరు.