Chilli Crop : మిరపలో కొమ్మకుళ్లు తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

కొమ్మలు కుళ్లిపోయి, క్రమేపి మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫొరా కొమ్మకళ్లు తెగులు అంటారు. అధిక వర్షాలు, తరచూ చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది.

Chilli Crop : మిరపలో కొమ్మకుళ్లు తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Chilli Crop

Chilli Crop : అధిక వర్షాల వల్ల మిరప తోటల్లో శిలీంధ్రపు బూజు తెగుళ్ల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొయినోఫోరా కొమ్మకుళ్లు తెగులు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెగులును సకాలంలో గుర్తించి నివారించకపోతే శిలీంధ్రం ద్వారా తోటంతా వ్యాపించి, మొక్కలు చనిపోయో ప్రమాధం వుంది. కొయినోఫోరా కొమ్మకుళ్లు లక్షణాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె. హేమంత్ కుమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు.

READ ALSO : Amazing Health Benefits : పాలల్లో నెయ్యి కలుపుకుని తాగటం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసా ?

కొమ్మలు కుళ్లిపోయి, క్రమేపి మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫొరా కొమ్మకళ్లు తెగులు అంటారు. అధిక వర్షాలు, తరచూ చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది. కొంతమంది రైతులు పాలీమల్చింగ్ పద్ధతిలో మిరప సాగుచేసినప్పటికీ ఈ శిలీంధ్రం దాడి నుండి పంటను తప్పించలేకపోయారు.

READ ALSO : Street Food : నోరూరించే స్ట్రీట్ ఫుడ్ తో కాలేయానికి ముప్పు !

ఖమ్మం జిల్లాలో వర్షాధారంగా మిరపను జూన్ నుండి ఆగష్టు వరకు, రబీలో నీటిపారుదల కింద, ఆ సెప్టెంబరు నుండి అక్టోబరు మొదటి వారం వరకు మిరప నాటారు. ప్రస్థుతం చాలాతోటల్లో ఈ కొమ్మకుళ్లు వుధృతి అధికంగా కనిపిస్తోంది. సకాలంలో దీన్ని అరికట్టకపోతే, కొమ్మల చివర్ల నుండి మొదలు వరకు ఈ తెగులు వ్యాపించి, మొక్కలు నిలువునా ఎండిపోయే ప్రమాదం వుంది. రైతులు వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. జె. హేమంత్ కుమార్..