Prawn Cultivation : శీతాకాలంలో వనామి రొయ్యలకు వైట్ స్ఫాట్, విబ్రియో ఉధృతి

సాధారణంగా ఎకరాకు లక్షపిల్లను వదిలిన చెరువులో 20శాతం మోర్టాలిటీ వుంటే, 30కౌంటు పెరుగుదలను నమోదుచేస్తే కనీసంగా రెండున్నర నుంచి 3టన్నుల దిగుబడి సాధించవచ్చు. అధిక సాంద్ర పద్ధతిలో ఎకరానికి 5నుంచి 6టన్నుల దిగుబడిని సాధించవచ్చు.

Prawn Cultivation : శీతాకాలంలో వనామి రొయ్యలకు వైట్ స్ఫాట్, విబ్రియో ఉధృతి

Prawn Cultivation

Prawn Cultivation : ఆక్వా పరిశ్రమలో వినూత్న ఒరవడికి తెరలేపిన వనామి రొయ్యల పెంపకం ఇటీవల తెల్లమచ్చ వైరస్, విబ్రియో బాక్టీరియా కల్చర్ ను వెన్నాడటంతో అధిక శాతం రైతులు తీవ్రంగా నష్టపోయారు.  ప్రస్థుతం ఎకరాకు  సాగు ఖర్చు 5లక్షలకు మించిపోవటం ఆందోళన కలిగించే పరిణామం. వర్షాకాలంలో ఎదురైన నష్టాలను పూడ్చుకునేందుకు చాలామంది రైతులు శీతాకాలపు పంటను కొనసాగిస్తున్నారు. వనామి రొయ్య కల్చర్ స్థితిగతులను, ఈ సమయంలో వనామి రొయ్యలం పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Cotton Crop : పత్తిచేలలో వర్షపు నీరు.. చీడపీడలు సోకే అవకాశం

అంతర్జాతీయ విపణిలో భారత దేశానికి డాలర్ల పంట పండిస్తున్న పరిశ్రమగా నేడు వనామి రొయ్యలసాగు ఖ్యాతినార్జించింది. టైగర్, స్కాంపీ రొయ్యలసాగులో వరుస ఉత్పాతాలతో సంక్షోభంలో చిక్కుకుపోయిన ఆక్వా రంగానికి వనామి రొయ్యలసాగు ఊపిరిపోస్తోంది. ఎకరానికి రెండున్నర లక్షల పిల్లలతో… అధిక సాంద్ర పద్ధతిలో ఈ కల్చర్ ను చేపట్టే అవకాశం వుండటంతో 2013 వరకు రైతులు ఒక పంటలో కాకపోతే మరో పంటలో ఆశాజనకమైన ఫలితాలు సాధించారు.

READ ALSO : Brinjal Cultivation : వంగతోటలను నష్టపరుస్తున్న చీడపీడలు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

సాధారణంగా ఎకరాకు లక్షపిల్లను వదిలిన చెరువులో 20శాతం మోర్టాలిటీ వుంటే, 30కౌంటు పెరుగుదలను నమోదుచేస్తే కనీసంగా రెండున్నర నుంచి 3టన్నుల దిగుబడి సాధించవచ్చు. అధిక సాంద్ర పద్ధతిలో ఎకరానికి 5నుంచి 6టన్నుల దిగుబడిని సాధించవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. వర్షాకాలం ప్రారంభం నుంచి  వ్యాధుల విజృంభణ అధిక మవటంతో ఈ ఏడాది అధిక శాతం మంది రైతులు నష్టపోయారు. వరుసగా తెల్లమచ్చ వైరస్, విబ్రియో బాక్టీరియా వంటి వ్యాధుల కల్చర్ పై దాడిచేయటంతో రైతులకు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.

READ ALSO : Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

వనామి రొయ్యల సాగులో చోటుచేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొంతమంది రైతులు పరిస్థితికి తగ్గట్టుగా కల్చర్ యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకుంటున్నారు. రొయ్యలు ఒత్తిడికి లోనై వ్యాధుల బారిన పడకుండా, ఎకరానికి రెండున్నర లక్షల పిల్లలకు బదులుగా లక్ష నుంచి లక్షన్నర పిల్లను వదిలి కల్చర్ చేపడుతున్నారు. వాస్తవానికి వనామి రొయ్యకు వైరస్ ను తట్టుకునే గుణముంది.

READ ALSO : Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

అయితే హేచరీల నుంచి వచ్చే పిల్లలో నాణ్యత లోపించటం, కల్చర్ యాజమాన్యం పట్ల సరైన అవగాహనలేని రైతులు కూడా లాభాపేక్షతో ఈ రంగంలోకి ప్రవేశించటం వల్ల, వ్యాధులు ఉదృతమై మంచి యాజమాన్యం చేపట్టిన రైతు కూడా నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. తెల్లమచ్చ వైరస్ ఒకసారి చెరువులోకి ప్రవేశించిందంటే చాలు… ఇక పంటపై ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే శీతాకాలంలో అధికంగా వచ్చే తెల్లమచ్చ వైరస్, విబ్రియో బ్యాక్టీరియాను అరికట్టేందుకు చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా మత్స్యకళాశాల అసోసియేట్ డీన్ డా. పి.హరిబాబు.