Railway Apprentice Recruitment 2023 : నార్త్ సెంట్రల్ రైల్వే లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1664 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్, rrcpryj.org ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

Railway Apprentice Recruitment 2023 : నార్త్ సెంట్రల్ రైల్వే లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

నార్త్ సెంట్రల్ రైల్వే లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

Railway Apprentice Recruitment 2023 : ఉత్తర మధ్య రైల్వేలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) అప్రెంటీస్ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1664 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్, rrcpryj.org ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. నవంబర్ 15నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 14, 2023న దరఖాస్తుకు చివరిగడువు తేదిగా నిర్ణయించారు.

READ ALSO : Uttarakhand Tunnel : సొరంగంలో ప్రాణాలు,ఆరు రోజులుగా ఉత్తరకాశీలో కార్మికుల కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

ఖాళీల వివరాలు ;

ఫిట్టర్, వెల్డర్, ఆర్మేచర్ విండర్, మెషినిస్ట్, వడ్రంగి, ఎలక్ట్రీషియన్, పెయింటర్ (జనరల్), మెకానిక్ (డిఎస్ఎల్), ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ నిర్వాహణ, వైర్మాన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, హెల్త్ శానిటరీ ఇన్సెక్టర్, మల్టీమీడియా వెబ్ పేజీ డిజైనర్, ఎమ్ ఎమ్ టీఎమ్, క్రేన్, డ్రాఫ్ట్స్ మన్, స్టెనో గ్రాఫర్, టర్నర్ వంటి ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Swaroopa Nandendra Saraswati : స్వరూపానందేంద్ర స్వామి కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్ లోనే ..

విద్యార్హతలు ;

అభ్యర్థి తప్పనిసరిగా SSC/మెట్రిక్యులేషన్/10వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి మరియు NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

READ ALSO : Health Tips : ఈ 5 రకాల పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దు ? ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎంపిక ప్రక్రియ ;

పదవతరగతిలో కనీసం 50% (మొత్తం) మార్కులతో ,అలాగే ఐటిఐ పరీక్ష రెండింటిలోనూ దరఖాస్తుదారులు పొందిన మార్కుల శాతాన్ని సరాసరి తీసుకొని మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ విధంగా నమోదు చేయబడిన షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులు డాక్యుమెంట్/సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.

READ ALSO : Telangana Assembly Elections 2023 : తెలంగాణ సరిహద్దు అసెంబ్లీ సెగ్మెంట్లలో పొరుగు రాష్ట్రాల ప్రభావం…పొరుగు నేతల ప్రచారం

దరఖాస్తు రుసుము ;

దరఖాస్తు రుసుము ₹100/-. SC/ST/PWD/మహిళలు దరఖాస్తుదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.

దరఖాస్తు చేసేందుకు డిసెంబర్ 14, 2023 చివరితేదిగా నిర్ణయించారు. దరఖాస్తు పూర్తి వివరాలకు వెబ్ సైట్ : www.rrcpryj.org