Swaroopa Nandendra Saraswati : స్వరూపానందేంద్ర స్వామి కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్ లోనే ..

సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తవుతుందని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ అధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దామని అన్నారు.

Swaroopa Nandendra Saraswati : స్వరూపానందేంద్ర స్వామి కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్ లోనే ..

Swaroopa Nandendra Saraswati

Updated On : November 18, 2023 / 9:56 AM IST

Sharada Peetham : శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పట్టణంలో ఇదే నా చివరి జన్మదినోత్సవం అని, వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్ లోనే ఉంటానని వెల్లడించారు. శుక్రవారం స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవ వేడుకలు విశాఖ శారదా పీఠంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సమీపం కోకాపేటలో విశాఖ శారదా పీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆథ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని, వచ్చే ఏడాది షష్టిపూర్తి కోకాపేటలోని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో చేసుకుంటానని తెలిపారు. అక్కడే ఉంటూ ఆదిశంకరుల అధ్వైత తత్వంపై పరిశోధనలు చేపడతానని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు.

Also Read : Telangana BJP Manifesto 2023 : బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్న కేంద్ర మంత్రి అమిత్ షా.. కీలక హామీలు ఇవే..

నేను సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తవుతుందని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ అధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దామని అన్నారు. ఆదిశంకరుల అద్వైత తత్వంపై విదేశాల్లోసైతం అధ్యయనం జరుగుతోందని, నేను అధ్యయన కేంద్రంలోనే ఉంటూ పరిశోధనల్లో పాల్గొంటానని చెప్పారు. పీఠం బాధ్యతలను వచ్చే ఏడాది పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి అప్పగిస్తానని, విద్యాధికుడైన ఆయన ధర్మ పరిరక్షణ బాధ్యతలు చూసుకుంటారని స్వామి వెల్లడించారు.