Telangana BJP Manifesto 2023 : బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్న కేంద్ర మంత్రి అమిత్ షా.. కీలక హామీలు ఇవే..

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీజేపీ శనివారం మానిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అయింది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా సాయంత్రం 5గంటల సమయంలో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Telangana BJP Manifesto 2023 : బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్న కేంద్ర మంత్రి అమిత్ షా.. కీలక హామీలు ఇవే..

Amit sha

Telangana BJP Manifesto 2023 Amithsha : తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం మానిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అయింది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా సాయంత్రం 5గంటల సమయంలో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అన్నివర్గాల ప్రజల్ని ఆకట్టుకునేలా దశదిశ పేరుతో కమలం పార్టీ మ్యానిఫెస్టోను రెడీ చేసినట్లు తెలిసింది. ధరణి స్థానంలో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటివాటిని మ్యానిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలుస్తోంది.

Also Read : Telangana Assembly Elections 2023 : తెలంగాణ సరిహద్దు అసెంబ్లీ సెగ్మెంట్లలో పొరుగు రాష్ట్రాల ప్రభావం…పొరుగు నేతల ప్రచారం

BJP మేనిఫెస్టో లో కొన్ని అంశాలు.. 

ధరణి స్థానంలో మీ భూమి యాప్

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్

4శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత

సబ్సిడీ పై విత్తనాలు.. వరిపై బోనస్

ఆడబిడ్డ భరోసా పథకం కింద 21యేళ్లు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు.

ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు.

మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు

ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ

బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు.

ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.

ఇండస్ట్రియల్ కారిడార్ ల ఏర్పాటు.

PRC పై రివ్యూ… ప్రతి 5 సంవత్సరాలకు ఓ సారి PRC. జీఓ 317 పై పునః సమీక్ష.

గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు.

ఐదేళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి

రోహింగ్యాలు, అక్రమ వలస దారులను పంపించి వేసేందుకు చర్యలు.

తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు.

అన్ని పంటలకు పంట భీమా.. భీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది

ఐదేళ్లలో మహిళలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు

వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం.