నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేలో 4వేలకు పైగా అప్రెంటీస్ ఉద్యోగాలు

నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో మెుత్తం 4499 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు డివిజన్లలో మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, లైన్‌మెన్ లాంటి పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించబడ్డాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వే-NFR అధికారిక వెబ్‌సైట్ https://nfr.indianrailways.gov.in/ చూడాలి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు :
కతిహార్ అండ్ టీడీహెచ్ వర్క్‌షాప్- 970
అలీపూర్‌దువార్- 497
రంగియా- 435
లుడింగ్ అండ్ ఎస్ అండ్ టీ వర్క్‌షాప్- 1302
టిన్సుకియా- 484
న్యూ బొంగైగాన్ వర్క్‌షాప్- 539
దిబ్రూఘ్- 276
విద్యార్హత : అభ్యర్దులు కనీసం 50 శాతం మార్కులతో 10వతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ను కలిగి పొంది ఉండాలి.
వయస్సు : అభ్యర్దుల వయస్సు జనవరి 1, 2020 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపికా విధానం : అభ్యర్దులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్దులు రూ.100 ఫీజు చెల్లించాలి. SC,ST,దివ్యాంగులు, మహిళా అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు 16,2020.
దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 15, 2020.