ONGC Recruitment : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అకాడమిక్‌ పరీక్షల్లో వచ్చిన పర్సంటేజి ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ ఉంటుంది. ఈ పోస్టులకి ఎలాంటి పరీక్ష ఉండదు.

ONGC Recruitment 2023

ONGC Recruitment : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Uttarakhand : దుస్తుల కొలతలు తీసుకునేందుకు వచ్చి విద్యార్థినులను వేధించిన టైలర్లు.. షాకిచ్చిన పోలీసులు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి BSC, BBA డిగ్రీ హోల్డర్లు, బీటెక్ పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ తరగతి ఉత్తీర్ణులు, డిప్లొమా హోల్డర్లు డిప్లొమా అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ట్రేడ్ అప్రెంటీస్ కోసం 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

READ ALSO : YSRCP : జగన్‌ను ఎదుర్కోవాలంటే అవతలి వైపు కూడా జగనే ఉండాలి, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా జగనే సీఎం- వైసీపీ నేతలు

అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అకాడమిక్‌ పరీక్షల్లో వచ్చిన పర్సంటేజి ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ ఉంటుంది. ఈ పోస్టులకి ఎలాంటి పరీక్ష ఉండదు. ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు నెలకు రూ.9000, డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు రూ. 8000 ,ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులకు నెలవారీ రూ.7000 స్టైఫండ్ అందుతుంది.

READ ALSO : TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు 20 సెప్టెంబర్ 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; ongcindia.com పరిశీలించగలరు.