Uttarakhand : దుస్తుల కొలతలు తీసుకునేందుకు వచ్చి విద్యార్థినులను వేధించిన టైలర్లు.. షాకిచ్చిన పోలీసులు

విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగడంతో యాజమాన్యం అలర్ట్ అయింది. వెంటనే పాఠశాల యాజమాన్యంలో పనిలో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరోవైపు ఇద్దరు టైర్లపై ..

Uttarakhand : దుస్తుల కొలతలు తీసుకునేందుకు వచ్చి విద్యార్థినులను వేధించిన టైలర్లు.. షాకిచ్చిన పోలీసులు

Uttarakhand

Uttarakhand Shocker: ఉత్తరాఖండలోని ఉధంసింగ్ నగర్ జిల్లా ఖతిమాలోని ఓ పాఠశాలలో విద్యార్థునులపై టైలర్లు వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పాఠశాలలో బాలికల దుస్తులకోసం ఇద్దరు టైలర్లు మహ్మద్ కమీల్, మహ్మద్ షకీల్‌తో పాటు ఖతిమా నగర్‌లోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ ఉద్యోగి ప్రతీక్ తివారీని పాఠశాలకు పిలిపించారు. బాలికల యూనిఫాం కోసం టైలర్లు ఇద్దరు కొలతలు తీసుకొనే క్రమంలో మైనర్ బాలికలను వేధించారు. విద్యార్థులు వెంటనే పాఠశాల యాజమాన్యంకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Crime News: మణిపూర్‌ తరహా ఘటన.. రాజస్థాన్‌లో యువతిని నగ్నంగా ఊరేగించి, వీడియోలు తీసి..

విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగడంతో యాజమాన్యం అలర్ట్ అయింది. వెంటనే పాఠశాల యాజమాన్యంలో పనిలో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరోవైపు ఇద్దరు టైర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాఠశాల వద్దకు వచ్చి టైలర్లను అదుపులొకి తీసుకుంటుండగా విద్యార్థునులు, వారి తల్లిదండ్రులు టైలర్లపై చెప్పులతో దాడిచేశారు. ఘటన విషయం తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర బిష్త్ వెంటనే పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థునుల తల్లిదండ్రులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరు టైలర్లతో పాటు ఘటన స్థలంలో ఉన్న పాఠశాల సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థునుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Crime News: 2 నెలల క్రితమే పెళ్లి.. వేరే అమ్మాయితో భర్త ఫోనులో మాట్లాడుతున్నాడని యువతి..

పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు టైలర్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాఠశాలలోని సీసీ టీవీ పుటేజీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉంటే, ఘటన విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నేత, ఖతిమా ఎమ్మెల్యే భువన్ కప్రీ పాఠశాల వద్దకు చేరుకొని తల్లిదండ్రుల నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఖతిమా కొత్వాలి ఎస్ఐ అశోక్ కుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, విచారణ అనంతరం దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.