19న జరిగే పరీక్షలు వాయిదా

  • Publish Date - October 18, 2019 / 03:48 PM IST

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో   అక్టోబర్19వ తేదీన శనివారం నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఆర్టీసీ జేఏసీతో సహా పలు సంఘాలు రాష్ట్రంలో బంద్‌ కు పిలుపునిచ్చినందున ముందు జాగ్రత్తగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు చెప్పారు. పరీక్షలను తదుపరి నిర్వహించాల్సిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు.