దరఖాస్తు చేసుకోండి : పవర్ గ్రిడ్ ట్రైనీ పోస్టులు

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో డిప్లామాలో ఎలక్ట్రికల్, సివిల్ ట్రైనీ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి వున్న అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత : అభ్యర్ధులు ఇంజనీరింగ్ డిప్లామా పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్ధులు రూ.300 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులకు, ఎక్స్ -సర్వీసెస్ మెన్, డిపార్ట్ మెంటల్ అభ్యర్ధులకు మాత్రం ఫీజు మినహాయింపు ఉంది.
వయోపరిమితి :
జనరల్ అభ్యర్ధులకు 27 సంవత్సరాలు, OBC అభ్యర్ధులకు 30 సంవత్సరాలు, SC,ST అభ్యర్ధులకు 32 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఎంపికైన అభ్యర్ధులకు ట్రైనింగ్ సమయంలో స్టెఫండ్ గా 25 వేలు ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రూ.25 వేల నుంచి లక్షా 17వేల 500 వస్తాయని తెలిపారు.
ముఖ్యతేదిలు:
దరఖాస్తు ప్రారంభ తేది : నవంబర్ 26,2019
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 16,2019
పరీక్ష కేంద్రాలు : ఢిల్లీ, జైపూర్, డెహ్రాడూన్.
Read Also: అప్లై చేసుకోండి : విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో అప్రెంటీస్ పోస్టులు