AP SI Physical Events : ఎస్ ఐ ఉద్యోగాలకు ఆగస్టు 25 నుండి ఫిజికల్ ఈవెంట్ల ప్రక్రియ

ఫిజికల్ ఈవెంట్ల ప్రక్రియను విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరు కేంద్రంగా నిర్వహించనున్నారు. ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్‌ లెటర్లను ఆగస్టు 14 నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తమ వెంట స్టేజ్‌-2 అప్లికేషన్‌ ఫాం తీసుకొని రావాల్సి ఉంటుంది.

AP SI Physical Events : ఎస్ ఐ ఉద్యోగాలకు ఆగస్టు 25 నుండి ఫిజికల్ ఈవెంట్ల ప్రక్రియ

AP Police Sub Inspector

Updated On : August 12, 2023 / 11:36 AM IST

AP SI Physical Events : ఎపిలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూలు విడుదలైంది. పోలీసు నియామక మండలి ఈ నియామకాలను చేపట్టనుంది. ఏపీలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నియమాక ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించి ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) బోర్డు నిర్వహించనుంది.

READ ALSO : Listen To Muslim Mann Ki Baat : మోదీజీ..ముస్లింల మన్ కీ బాత్ వినండి .. ప్రధానికి ముస్లిం మత పెద్ద సూచన

ఫిజికల్ ఈవెంట్ల ప్రక్రియను విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరు కేంద్రంగా నిర్వహించనున్నారు. ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్‌ లెటర్లను ఆగస్టు 14 నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తమ వెంట స్టేజ్‌-2 అప్లికేషన్‌ ఫాం తీసుకొని రావాల్సి ఉంటుంది.

READ ALSO : Kandi Crop Cultivation : పెరిగిన కంది సాగు విస్తీర్ణం.. అధిక దిగుబడి కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించగా రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగావారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించగా, వారిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు.

READ ALSO : Flag of India : జాతీయ జెండా ఎగరవేసేటపుడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి

సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు , ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://slprb.ap.gov.in/ పరిశీలించగలరు.