Punjab Police Constable Result : పంజాబ్ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ విడుదల.. ఫలితాలను ఇలా చెక్ చేయండి!

Punjab Police Constable Result 2024 : పంజాబ్ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ విడుదల.. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులు (punjabpolice.gov.in)లో అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చెక్ చేయవచ్చు.

Punjab Police Constable Result : పంజాబ్ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ విడుదల.. ఫలితాలను ఇలా చెక్ చేయండి!

Punjab Police Constable Result 2024 Declared

Updated On : November 18, 2024 / 11:15 PM IST

Punjab Police Constable Result 2024 : పంజాబ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నవంబర్ 18న కానిస్టేబుల్ పరీక్ష 2024 ఫలితాలను ప్రకటించింది. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులు (punjabpolice.gov.in)లో అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చెక్ చేయవచ్చు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎమ్‌టీ), ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ (పీఎస్‌టీ) కూడా రాయాల్సి ఉంటుంది. ఎస్‌సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్-సర్వీస్ మ్యాన్ కేటగిరీల అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 35 శాతం స్కోర్ సాధించాలి. ఇతర కేటగిరీల అభ్యర్థులకు కనీసం 40 శాతం స్కోర్ అవసరం.

పంజాబ్ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ 2024 : ఎలా చెక్ చేయాలి? :

  • పంజాబ్ పోలీసు శాఖ అధికారిక వెబ్‌సైట్‌ (punjabpolice.gov.in)ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో, ఎడమ వైపున ఉన్న “రిక్రూట్‌మెంట్” బటన్‌పై క్లిక్ చేయండి.
  • రిక్రూట్‌మెంట్ విభాగంలో పంజాబ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫైనల్ రిజల్ట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
  • పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్‌లతో కూడిన పీడీఎఫ్ ఫైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం పంజాబ్ పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్స్ 2024ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.

పంజాబ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2024 :
పంజాబ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కింద 1746 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోలీసు శాఖ పంజాబ్‌లోని జిల్లా పోలీసు కేడర్‌కు 970, సాయుధ పోలీసు కేడర్‌కు 776 పోస్టులను కేటాయించింది.

జిల్లా పోలీసు కేడర్ :
జనరల్: 410 పోస్టులు
షెడ్యూల్డ్ కులాలు బాల్మీకి/మజ్బీ సిక్కులు: 100 పోస్టులు
షెడ్యూల్డ్ కులాలు రాందాసియా & ఇతరులు: 100 పోస్ట్‌లు
వెనుకబడిన తరగతులు : 100 పోస్టులు
ఎక్స్-సర్వీస్‌మెన్ (జనరల్) : 70 పోస్టులు
ఎక్స్-సర్వీస్‌మెన్ షెడ్యూల్డ్ కులాలు బాల్మీకి/మజ్బీ సిక్కు : 20 పోస్టులు
మాజీ సైనికోద్యోగి షెడ్యూల్డ్ కులాలు రాందాసియా, ఇతరులు : 20 పోస్టులు
ఎక్స్-సర్వీస్‌మెన్ వెనుకబడిన తరగతులు : 20 పోస్టులు
పోలీసు సిబ్బంది వార్డులు : 20 పోస్టులు

Read Also : Reliance Jio Offer : జియో 5జీ వోచర్ ఆఫర్.. కేవలం రూ. 601 మాత్రమే.. ఏడాదంతా అన్‌లిమిటెడ్ 5జీ పొందొచ్చు!