గెట్ రెడీ : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ వినిపించింది. 1.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి శనివారం(ఫిబ్రవరి-23-2019) నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ వినిపించింది. 1.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి శనివారం(ఫిబ్రవరి-23-2019) నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ వినిపించింది. 1.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి శనివారం(ఫిబ్రవరి-23-2019) నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభం కానుంది. కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. రైల్వే శాఖ భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో ట్రాక్‌మెన్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గార్డ్, పారామెడికల్ సిబ్బంది, నర్సులు తదితర పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు, పరీక్షా కేంద్రాలు తదితర వివరాలను నోటిఫికేషన్‌లో తెలుపుతారు.
నాన్ టెక్నికల్ పోస్టులు:
* ఫిబ్రవరి 28 నుంచి ఆన్‌లైన్‌లో పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు
* జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
* అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్
* ట్రైన్స్ క్లర్క్
* కమర్షియల్ కమ్ టికెట్ * క్లర్క్
* ట్రాఫిక్ అసిస్టెంట్
* గూడ్స్ గార్డ్
* సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్
* సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
* జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
* కమర్షియల్ అప్రెంటీస్
* స్టేషన్ మాస్టర్
పారా మెడికల్ పోస్టులు:
వైద్య విభాగంలోని పారామెడికల్ ఉద్యోగాలకు 2019 మార్చి 4 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
* నర్సు
* హెల్త్ ఇన్‌స్పెక్టర్
* మలేరియా ఇన్‌స్పెక్టర్
* ఫార్మాసిస్ట్
* ఈసీజీ టెక్నీషియన్
* ల్యాబ్ అసిస్టెంట్
* ల్యాబ్ సూపరింటెండెంట్
ఆఫీస్ జాబ్స్:
మార్చి 8 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
* స్టెనోగ్రాఫర్
* చీఫ్ అసిస్టెంట్
* జూనియర్ అనువాదకుడు (హిందీ)
* మొత్తం 3 విభాగాల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం
లెవల్-1 ఉద్యోగాలు:
లెవల్-1 (గతంలో గ్రూపు-డి కేటగిరీ అని పిలిచేవారు) ఉద్యోగాలకు మార్చి 12 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
* ఈ విభాగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ
* ఈ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు రిజర్వేషన్లు
రానున్న రెండేళ్లలో రైల్వేల్లో లక్ష మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు రిటైర్ కానున్నారు. ఈ ఖాళీలను కూడా తాజా నోటిఫికేషన్‌లో పొందుపరచనున్నారు.
Read Also: గ్రే లిస్ట్ లో పాకిస్తాన్: భారత్ ప్రయత్నాలు ఫలించేనా?
Read Also: సక్కగా వెళ్లటం లేదా : హైదరాబాదీలు కట్టాల్సిన ట్రాఫిక్ ఫైన్స్ రూ.63 కోట్లు