గెట్ రెడీ : రైల్వేలో 2లక్షల 30వేల ఉద్యోగాలు
ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లలో రైల్వేలో 2లక్షల 30వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని తెలిపారు. తొలి దశలో లక్ష 31వేల పోస్టులను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 14 నెలల క్రితం లక్ష 51వేల 548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, ఇప్పుడు దానికి అదనంగా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని మంత్రి చెప్పారు. ఈ పోస్టులకు స్థాయిని బట్టి ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్హతలు ఉన్నవారు అర్హులని మంత్రి ప్రకటించారు.
అంతే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను ఈ నోటిఫికేషన్లకు వర్తింపజేయనున్నట్టు మంత్రి తెలిపారు. 23వేల మంది పేదలు లబ్ధి పొందుతారని మంత్రి వివరించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ను అమలుచేయబోయే తొలి ప్రభుత్వ విభాగంగా భారతీయ రైల్వే నిలవబోతోందని పీయూష్ గోయల్ తెలిపారు. 2019–20 మధ్యకాలంలో 53వేల మంది, 2020–21 కాలంలో 46వేల మంది ఉద్యోగులు రైల్వేశాఖ నుంచి పదవీ విరమణ చేయబోతున్నారని చెప్పారు.
* రైల్వేలో ఉద్యోగాల సునామీ
* రెండేళ్లలో 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ
* తొలి దశలో 1.31లక్షల ఉద్యోగాలు భర్తీ
* రెండో దశలో 99వేల ఉద్యోగాలు భర్తీ
* 10% పేదల కోటా అమలు
* పేదల కోటా కింద 23వేల ఉద్యోగాలు