ITBP Recruitment 2023 : ఐటీబీపీలో 248 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

అభ్లెటిక్స్‌, ఆక్వాటిక్స్‌, ఈక్వెస్టియన్‌, స్పోర్ట్స్‌ షూటింగ్‌, బాక్సింగ్‌, పుట్‌బాల్‌ జిమ్నాస్టిక్స్‌ హాకీ వెయిట్‌ లిఫ్టింగ్‌, ఉషు, కబడ్డీ రెజ్లింగ్‌, ఆర్బరీ, కయాకింగ్‌, కానోయింగ్‌, రోయింగ్‌ తదితర క్రీడల్లో ప్రతిభకలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ITBP Recruitment 2023 : ఐటీబీపీలో 248 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

ITBP Recruitment 2023

Updated On : November 12, 2023 / 11:40 AM IST

ITBP Recruitment 2023 : భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)లో స్పోర్ట్స్‌ కోటా2023 కింద కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 248 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : AISSEE 2024 : అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024).. దరఖాస్తుకు తుదిగడువు ఇదే !

ఖాళీల వివరాలు:

కానిస్టేబుల్‌[జనరల్‌ డ్యూటీ) గ్రూవ్‌ ‘సి’ నాన్‌-గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌): 218 ఖాళీలు ఉన్నాయి.

క్రీడాంశాలు:

అభ్లెటిక్స్‌, ఆక్వాటిక్స్‌, ఈక్వెస్టియన్‌, స్పోర్ట్స్‌ షూటింగ్‌, బాక్సింగ్‌, పుట్‌బాల్‌ జిమ్నాస్టిక్స్‌ హాకీ వెయిట్‌ లిఫ్టింగ్‌, ఉషు, కబడ్డీ రెజ్లింగ్‌, ఆర్బరీ, కయాకింగ్‌, కానోయింగ్‌, రోయింగ్‌ తదితర క్రీడల్లో ప్రతిభకలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

READ ALSO : Iceland High Alert : ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వత విస్ఫోటన ముప్పు…హై అలర్ట్‌ జారీ

అర్హతలు:

గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.

వయోపరిమితి:

21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం :

నెలకు రూ.21,00-రూ.69100.

READ ALSO : Guvvala Balaraju : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి

పరీక్ష ఫీజు ;

జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యుఎస్ రూ 100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ;

ఆన్ లైన్ దరఖాస్తులు 13-11-2023 నుండి ప్రారంభమవుతాయి.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి గడువు తేది 28-11-2023గా నిర్ణయించారు.

పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ ; www.recruitment.itbpolice.nic.in