Indian Navy : ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీ

ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మార్కులు మెరిట్ అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం రాతపరీక్ష , ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.

Indian Navy : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీలో అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 40 పోస్టులు మహిళలకు కేటయించనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో చెఫ్, స్టీవార్డ్, హైజినీస్ట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మార్కులు మెరిట్ అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం రాతపరీక్ష , ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జులై 25, 2022 నుండి ప్రారంభమై 30, జులై , 2022తో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.joinindiannavy.gov.in/పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు