NABFID Officer Recruitment
Recruitment of NABFID : నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్(ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ)ముంబయిలో అనలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల కేటాయింపుకు సంబంధించి జనరల్ – 40, ఈడబ్ల్యూఎస్ – 02, ఓబీసీ – 09, ఎస్సీ – 04, ఎస్టీ – 01 కేటాయించారు.
READ ALSO : Mega Family : ఇటలీ నుంచి మెగా ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసిన ఉపాసన..
ఖాళీల వివరాలు ;
విభాగాలవారీగా ఖాళీలను పరిశీలిస్తే లెండింగ్ ఆపరేషన్స్: 15 పోస్టులు, హ్యూమన్ రిసోర్సెస్: 02 పోస్టులు, ఇన్వెస్ట్‌మెంట్ & ట్రెజరీ: 04 పోస్టులు, ఐటీ & ఆపరేషన్స్: 04 పోస్టులు, జనరల్ అడ్మినిస్ట్రేషన్: 07 పోస్టులు, రిస్క్ మేనేజ్‌మెంట్: 10 పోస్టులు, లీగల్: 02 పోస్టులు, ఇంటర్నల్ ఆడిట్ & కంప్లయన్స్: 03 పోస్టులు, కంపెనీ సెక్రటేరియట్: 02 పోస్టులు, అకౌంట్స్: 02 పోస్టులు, స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ & పార్ట్‌నర్‌షిప్స్: 04 పోస్టులు, ఎకనామిస్ట్: 01 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : KTR : కాంగ్రెస్ కు ఓటు వేస్తే దుష్టపాలన.. తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం : మంత్రి కేటీఆర్
విద్యార్హత, వయస్సు ;
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/ పీజీ, ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ/ సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
READ ALSO : CPM : కాంగ్రెస్ తో కుదరని పొత్తు.. సీపీఎం ఒంటరిగానే పోటీ!
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల (సెక్షన్-ఎ, సెక్షన్-బి) నుంచి మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కుల విధానం అమలు చేస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
READ ALSO : Sattu Pindi Benefits : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పిండి సూపర్ ఫుడ్ !
దరఖాస్తు గడువు ;
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 13.11.2023.గా నిర్ణయించారు. ఆన్‌లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు నవంబర్/ డిసెంబర్ 2023 మాసాలలో ఉంటాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nabfid.org/ పరిశీలించగలరు.