CPM : కాంగ్రెస్ తో కుదరని పొత్తు.. సీపీఎం ఒంటరిగానే పోటీ!

సీపీఎం కోరిన మిర్యాలగూడ, వైరా నియోజకవర్గాలకు కాంగ్రెస్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీపీఎం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

CPM : కాంగ్రెస్ తో కుదరని పొత్తు.. సీపీఎం ఒంటరిగానే పోటీ!

CPM

Congress Has No Alliance With CPM : ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై చర్చోచర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ వీరి మధ్య పొత్తు తెగడం లేదు. కాగా, కాంగ్రెస్ పొత్తులో భాగంగా వామపక్షాలకు నాలుగు స్థానాలు కేటాయించాలని భావించాయి. సీపీఎం, సీపీఐకి చెరో రెండో సీట్ల చొప్పున కేటాయింపు దిశగా ఆలోచనలు చేశారు. ఈ నేపథ్యంలో సీపీఎంకు సీట్ల కేటాయింపు విషయంలో ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ తో సీపీఎం పొత్తు కుదరలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం సింగిల్ గానే పోటీ చేసే కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా సీపీఎం అడిగిన రెండు సీట్లను కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. సీపీఎం కోరిన మిర్యాలగూడ, వైరా నియోజకవర్గాలకు కాంగ్రెస్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీపీఎం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

Chalamala Krishna Reddy : మునుగోడులో కచ్చితంగా పోటీ చేస్తా, నల్లొండ జిల్లాలో నా తడాఖా ఏంటో చూపిస్తా- కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి హాట్ కామెంట్స్

మధ్యాహ్నం 3 గంటలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మరిన్ని విషయాలపై క్లారిటీ రానుంది. కాగా, సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో జత కలిసే ఎన్నికల్లో బరిలో దిగుతోంది. సీపీఐకి కొత్తగూడెం సీటును కాంగ్రస్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సీపీఐకి కేటాయించాల్సిన మరోసాన్థంపై సస్పెన్స్ కొనసాగుతోంది.