Sattu Pindi Benefits : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పిండి సూపర్ ఫుడ్ !

ఉదయం అల్పాహారం సమయంలో సత్తును తీసుకోవడం చాలా ప్రయోజనకరం. టాక్సిన్స్ శరీరం నుండి బయటకుపంపటంలో సహాయపడుతుంది. గ్యాస్‌ సమస్య వస్తుందనే భయం ఉన్నవారు తినకుండా ఉండటమే మంచిది.

Sattu Pindi Benefits : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పిండి సూపర్ ఫుడ్ !

Sathu pindi

Sattu Pindi Benefits : భారతదేశంలోని అనేక ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రొటీన్ పౌడర్లలో సత్తు పిండి కూడా ఒకటి. దీనిని పేద వారి ప్రొటీన్ పొడిగా పిలుస్తారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఆరోగ్యకరమైన పౌడర్ గా చెప్పవచ్చు. ఈ పిండితో రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. దీనిలో శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. శనగలతోపాటు, గోధుమ, రాగి వంటి తృణధాన్యాలను కలిపి మెత్తటి పొడిగా మార్చి ఈ సత్తు పిండిని తయారు చేస్తారు. ఫిట్‌గా ఉండాలన్నా, వ్యాధులు దరిచేరకుండా చూసుకోవాలన్నా రోజువారీ ఆహారంలో సత్తు పిండిని చేర్చుకోవటం మంచిది.

READ ALSO : Recovery After Stroke : స్ట్రోక్ తర్వాత కోలుకోవడానికి వైద్యులు అందిస్తున్న సూచనలు

సత్తుపిండి ఆరోగ్య ప్రయోజనాలు ;

సహజ సిద్ధ సమ్మర్ కూలర్: సత్తుతో తయారు చేసిన డ్రింక్ వేసవిలో దాహాన్ని తీర్చుకోవడానికి మంచి పానీయంగా చెప్పవచ్చు. ఇది శరీరం వేడెక్కకుండా నిరోధించి శరీర ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గిస్తుంది.

అధిక పోషక విలువలు: సత్తు పిండి పొడి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

READ ALSO : Sore Throat : గొంతు నొప్పితో బాధపడుతున్నారా ? ఈ నీరు గ్లాసు చాలు..

జీర్ణక్రియకు : సత్తులో అధిక మొత్తంలో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది ప్రేగులకు మేలు చేస్తుంది. పెద్దప్రేగును శుభ్రపరుస్తుంది, జిడ్డుగల ఆహారం, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి మలినాలను తొలగిస్తుంది. పీచు, ప్రొటీన్, ఇతర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పోషకాలు సత్తులో లభిస్తాయి. కడుపు సంబంధిత సమస్యలకు దివ్యౌషధంగా సహాయపడుతుంది.

వ్యాధులతో పోరాడటంలో: సత్తు పౌడర్ తక్కువ-గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే అధిక పీచు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడే వారికి చాలా ఉపయోగకరం.

READ ALSO : Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !

బరువు తగ్గడానికి : బరువు తగ్గాలనుకుంటే, ఖాళీ కడుపుతో సత్తు పౌడర్ ను తీసుకోవటం మంచిది. ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేస్తుంది. సమ్మర్ సీజన్‌లో బరువు తగ్గాలంటే సత్తును మించిన ఆప్షన్ మరొకటి ఉండదు. వేసవి కాలంలో సత్తు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువును కూడా తగ్గిస్తుంది. కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ కేలరీలు తీసుకోరు. బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉన్నవారికి బాగా ఉపకరిస్తుంది.

READ ALSO :Heart Health : ఎదుగుతున్న వయస్సు వారు తమ గుండె ఆరోగ్యాన్నిజీవితకాలం కాపాడుకోవటానికి వైద్యులు ఏంసూచిస్తున్నారంటే ?

ఉదయం అల్పాహారం సమయంలో సత్తును తీసుకోవడం చాలా ప్రయోజనకరం. టాక్సిన్స్ శరీరం నుండి బయటకుపంపటంలో సహాయపడుతుంది. గ్యాస్‌ సమస్య వస్తుందనే భయం ఉన్నవారు తినకుండా ఉండటమే మంచిది. ఈ పప్పుతో అలర్జీ కలుగుతుందనుకునే వారు దీనిని తినకుండా ఉండటమే మంచిది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.