Recovery After Stroke : స్ట్రోక్ తర్వాత కోలుకోవడానికి వైద్యులు అందిస్తున్న సూచనలు

పక్ష వాతం వచ్చేముందు మూతి వంకరపోవటం, చేయి బలహీనత, అస్పష్టమైన మాటలు, వెర్టిగో, ఆకస్మిక మైకంలోకి వెళ్ళటం, దృష్టిలో మార్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి సంకేతాలు ఉంటాయి.

Recovery After Stroke : స్ట్రోక్ తర్వాత కోలుకోవడానికి వైద్యులు అందిస్తున్న సూచనలు

Stroke Recovery

Recovery After Stroke : ప్రతి సంవత్సరం అక్టోబర్ 29 న ప్రపంచ స్ట్రోక్ డేని జరుపుకుంటారు. స్ట్రోక్ ను మరోపేరుతో పక్షవాతం అనిపిలుస్తారు. పక్షవాతం వచ్చిన సమయంలో కాళ్ళు ,చేతులు మొద్దుబారటం, గందరగోళం, మాటల్లో తడబాటు ,మైకము, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా అంతరాయం కలుగుతుంది. ఆ సమయంలో మెదడు కణజాలానికి రక్తం , ఆక్సిజన్ లభించదు. ఈ సందర్భంలో స్ట్రోక్ కు గురికావాల్సి వస్తుంది. స్ట్రోక్ వల్ల మెదడులో రక్త ప్రవాహానికి అంతరాయం కలిగి మెదడు కణాలకు నష్టం కలుగుతుంది. సకాలంలో వైద్య సహాయం అందితే త్వరగా దీనిని నుండి కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.

READ ALSO : Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !

పక్షవాతం వల్ల కండరాల బలహీనత, దృఢత్వం కోల్పోవటం వంటి మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా శరీరం లో ఒక వైపు బాగం మొత్తం స్ట్రోక్ ప్రభావానికి గురై దీర్ఘకాలిక ఇబ్బందులను కలిగిస్తుంది. పెద్ద వయస్సు వారిలో పక్షవాతం అధికంగా వస్తుంది. జీవనశైలి కారణాల వల్ల మరణాలలో నాల్గవ స్థానంలో , పక్ష వాతం కారణంగా వైకల్యంలో ఐదవ స్థానంలో భారతదేశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలకు ఇది కారణం అవుతుంది.

READ ALSO : సరిగ్గా నిద్రపోవడం లేదా? ఈ రోగాలు వస్తాయ్

మెదడుకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి, అత్యవసర మందులు, ఎండోవాస్కులర్ ప్రక్రియలు, శస్త్రచికిత్సలతో చికిత్స అత్యవసరమౌతుంది. కొన్ని స్ట్రోక్‌లకు రక్తం క్లాట్-కరిగించే మందులు, థ్రోంబెక్టమీ వంటి విధానాలతో చికిత్స అందిస్తారు. దీని వల్ల మెదడు దెబ్బతినటం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా, స్ట్రోక్ వచ్చిన తరువాత రికవరీ కావటం అన్నది చాలా ముఖ్యమైనది. సరైన జాగ్రత్తలు పాటించటం ద్వారా తిరిగి సాధారణ జీవితాన్ని గడవచ్చు. జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : వర్షాకాలంలో వీటి జోలికి వెళ్ళి రోగాలు కొనితెచ్చుకోకండి!

స్ట్రోక్ తర్వాత జీవన నాణ్యతను మెరుగుపరచడానికి నిపుణుల సూచనలు

1. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం ;

పక్ష వాతం వచ్చేముందు మూతి వంకరపోవటం, చేయి బలహీనత, అస్పష్టమైన మాటలు, వెర్టిగో, ఆకస్మిక మైకంలోకి వెళ్ళటం, దృష్టిలో మార్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి సంకేతాలు ఉంటాయి. ఇలాంటి పరిస్ధితులు ఉన్నప్పుడు తక్షణం అప్రమత్తంగా ఉండాలి. స్ట్రోక్ ప్రమాదం నుండి బయటపడటానికి, నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం కీలకం.

READ ALSO : Rainy Season Diseases : వర్షకాలంలో వీటి జోలికి వెళ్ళి రోగాలు కొనితెచ్చుకోకండి!

అధిక రక్తపోటు, మధుమేహం,అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడానికి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఆహారం తీసుకోవాలి. ఉప్పు, చక్కెర , సంతృప్త కొవ్వులను పరిమితం చేయాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వైద్యులు సిఫార్సు మేరకు రోజువారిగా వ్యాయామాలు చేయాలి. ఒత్తిడిని తగ్గించుకుంటూ మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. తగినంత నిద్ర త్వరగా కోలుకోవటానికి సహాయపడుతుంది.

READ ALSO : Rainy Season Health : వర్షకాలంలో రోగాలు తెచ్చిపెట్టే కలుషితనీరు, ఆహారం!

2. మందుల వినియోగం ;

స్ట్రోక్ తరువాత ఎదురయ్యే అంతర్లీన పరిస్థితులను ఎదుర్కోవటానికి , భవిష్యత్తులో తిరిగి స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మందులు తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. వీటిలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి బ్లడ్ థిన్నర్స్, అధిక రక్తపోటును నియంత్రించడానికి యాంటీహైపెర్టెన్సివ్‌లు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వంటివి ఉంటాయి. ఈ ఔషధాల ప్రభావాన్ని పర్యవేక్షించడానికి, అవసరమైన మార్పులు చేయటానికి వైద్యులను రెగ్యులర్ చెకప్ లకోసం కలవటం మంచిది.

READ ALSO : Anti Aging Foods : వృద్ధాప్య ప్రభావం మీ మెదడుపై పడకుండా ఆరోగ్యంగా ఉంచడానికి 5 ఆహారాలు !

3. తిరిగి కోలుకునేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించటం ;

స్ట్రోక్ తరువాత తిరిగి కోలుకోవటం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించటం అన్నది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాణాలతో బయటపడిన వారు తిరిగి సాధారణస్ధితికి వచ్చేందుకు వైద్యులు సూచించిన విధంగా ఫిజికల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ , స్పీచ్ థెరపీని అనుసరించాలి. వైద్యులు, నిపుణుల సూచనలతో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించటం వల్ల పూర్తిస్ధాయిలో కోలుకోవచ్చు.

READ ALSO : Heart Health : గుండె ఆరోగ్యం కోసం… కార్డియాక్ ఎక్సర్ సైజులు

4. అందరి మద్దతు అవసరం ;

స్ట్రోక్ తర్వాత కోలుకోవటం అన్నది పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ సమయంలో మద్దతు అన్నది రోగులకు మనోధైర్యాన్ని నింపతుంది. కుటుంబం, స్నేహితులు, రోజువారీ కార్యకలాపాలకు సహాయం అందించాలి. పక్షవాతం పరిస్ధితి నుండి రికవరీ అయ్యేందుకు వీరి తోడ్పాటు ఎంతగానో తోడ్పడుతుంది.

READ ALSO : Hyperthyroidism : థైరాయిడ్ శరీర ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఓవర్యాక్టివ్ థైరాయిడ్ యొక్క సంకేతాలు !

5. ఓపికగా మెలగటం

స్ట్రోక్ తర్వాత కోలుకోవడంలో అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ సమయంలో సానుకూల దృక్పథాన్నికలిగి ఉండటంతోపాటు ఓపికగా మెలగాలి. రికవరీ విషయంలో నిరుత్సాహపడకుండా ఉండలి. సానుకూల మనస్తత్వంతో పాటు, స్ట్రోక్ రికవరీ ప్రక్రియ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.