RRC SCR Recruitment : దక్షిణ మధ్య రైల్వే సికింద్రబాద్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 50 శాతం మార్కులతో పదవతరగతి , సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

RRC SCR Recruitment :
RRC SCR Recruitment : సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ వర్క్ షాప్ యూనిట్ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4103 అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నారు.
ట్రేడుల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే ఏసీ మెకానిక్ 250, కార్పెంటర్ 18, డీజిల్ మెకానిక్ 531, ఎలక్ట్రీషియన్1019, ఎలక్ట్రానిక్ మెకానిక్ 92, ఫిట్టర్ 1460, మెషినిస్ట్ 71, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 5, మిల్ రూట్ మెయింటెనెన్స్ 24, పెయింటర్ 80, వెల్డర్ 553 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 50 శాతం మార్కులతో పదవతరగతి , సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పదోరతగతి, ఐటీఐలో సాధించిన మార్కుల అధారంగా ఉంటుంది.
దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా జనవరి 29, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; scr.indianrailways.gov.in