Oil India  : ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటిస్ ల భర్తీ

విద్యార్హత విషయానికి వస్తే పదవతరగతి, ఇంటర్మీడియట్ తోపాటు సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. గ్రేడ్ 3 పేస్కేల్ ప్రకారం నెలకు 26,600 నుండి 90,000వరకు చెల్లిస్తారు. ఎంపిక విధ

Oil India  : ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటిస్ ల భర్తీ

Oil India

Updated On : August 29, 2021 / 4:43 PM IST

Oil India  : భారత ప్రభుత్వరంగ సంస్ధ ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటీస్ ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 535 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్,మెకానిక్ మోటార్ వెహికిల్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, టర్నర్ తదితర విభాగాల్లో అప్రపెంటీస్ ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత విషయానికి వస్తే పదవతరగతి, ఇంటర్మీడియట్ తోపాటు సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. గ్రేడ్ 3 పేస్కేల్ ప్రకారం నెలకు 26,600 నుండి 90,000వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అధారంగా ఉంటుంది.

అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా అందించాల్సి ఉంటుంది. ధరఖాస్తుకు చివరి తేది సెప్టెంబరు 23గా నిర్ణయించారు. వివరాలకు వెబ్ సైట్ https://www.oilindia.comని పరిశీలించగలరు.