AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీ

ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.77,840ల నుంచి రూ.1,36,520ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుదారుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీ

Recruitment of Civil Judge Posts in High Court of Andhra Pradesh State

Updated On : November 11, 2022 / 5:20 PM IST

AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌, ట్రాన్ఫర్‌ ప్రాతిపదికన 31 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ 26, ట్రాన్ఫర్‌ కింద 5 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు లా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదాసెక్షన్‌ ఆఫీసర్/కోర్ట్‌ ఆఫీసర్‌/సెక్యురిటీ ఆఫీసర్‌/అసిస్టెంట్ లైబ్రేరియన్‌ తదితర సెక్షన్‌లలో ఇప్పటికే సభ్యుడిగా ఉండాలి.

ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.77,840ల నుంచి రూ.1,36,520ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుదారుల వయసు 35 ఏళ్లకు మించరాదు. అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 8, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://hc.ap.nic.in/recruitment.html పరిశీలించగలరు.