Telangana Lecturer Jobs : తెలంగాణా రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి 2023 ఏప్రిల్ 17న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2023 మే 17 దరఖాస్తుకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. మొత్తం ఖాళీల సంఖ్య పెరగే అవకాశాలు ఉన్నాయి. ఎంపికైనవారికి రూ.58,850 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,37,050 వేతనం లభిస్తుంది.

Telangana Lecturer Jobs : తెలంగాణా రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ

Junior Lecturer job

Updated On : April 6, 2023 / 3:22 PM IST

Telangana Lecturer Jobs : తెలంగాణా రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 2876 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగానా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూటషన్స్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఈ ప్రక్రియను చేపట్టనుంది. మొత్తం ఖాళీలలో డిగ్రీ లెక్చరర్ పోస్టులు 868 ఉండగా, జూనియర్ లెక్చరర్ పోస్టులు 2008 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ సమస్య గురించి కళ్ళు, కాళ్ళు, నాలుకలో కనిపించే 5 సంకేతాలు !

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో జూనియర్ లెక్చరర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Workout Injuries : జిమ్ గాయాలు ఫిట్‌నెస్ లక్ష్యాలకు అంతరాయం కలిగిస్తే? వాటిని ఎలా నయం చేసుకోవాలంటే..

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి 2023 ఏప్రిల్ 17న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2023 మే 17 దరఖాస్తుకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. మొత్తం ఖాళీల సంఖ్య పెరగే అవకాశాలు ఉన్నాయి. ఎంపికైనవారికి రూ.58,850 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,37,050 వేతనం లభిస్తుంది. ఖాళీలు, వయస్సు, కమ్యూనిటీ, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో 2023 ఏప్రిల్ 17న డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కానుంది.పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://treirb.telangana.gov.in/ లో పరిశీలించగలరు.