Workout Injuries : జిమ్ గాయాలు ఫిట్‌నెస్ లక్ష్యాలకు అంతరాయం కలిగిస్తే? వాటిని ఎలా నయం చేసుకోవాలంటే..

ప్రాథమిక వ్యాయామాల నుండి ప్రారంభించటంతోపాటు, తక్కువ బరువు గల వాటిని ప్రయత్నించాలి. వ్యాయామశాలలో నిర్లక్ష్యంగా ఉండకుండా శిక్షకుడి మాట వింటూ తదనుగుణంగా నచుడుకోవాలి. సరైన కండరాలపై దృష్టి పెట్టడంలో మీకు సహాయపడే ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి.

Workout Injuries : జిమ్ గాయాలు ఫిట్‌నెస్ లక్ష్యాలకు అంతరాయం కలిగిస్తే? వాటిని ఎలా నయం చేసుకోవాలంటే..

Workout Injuries

Workout Injuries : వ్యాయామశాలలో వ్యాయామం చేయడం వల్ల కొన్నిసందర్భాల్లో తీవ్రమైన గాయాలు అవుతాయి. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవటం చాలా కష్టం. గాయాలు వల్ల వ్యాయామ విధానంలో మార్పులు చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. గాయాల నుండి రికవరీ వేగం వ్యక్తికి, వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. కొంతమంది త్వరగా కోలుకోవచ్చు, మరికొందరు కోలుకునేందుకు రోజులు లేదా నెలలు కూడా పట్టవచ్చు. గాయానికి అందే వైద్యం, గాయం యొక్క తీవ్రతపై ఇది ఆధారపడి ఉంటుంది.

READ ALSO : Fitness Exercisers : ఫిట్ నెస్ వ్యాయామాలు చేసే వారు శక్తి కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?

చాలా మంది వ్యాయామశాలలో తగిలే గాయాల వల్ల భయంతో దానిని నుండి బయటపడి కోలుకున్న తరువాత తిరిగి వ్యాయామాశాలకు వెళ్ళటం మానేస్తుంటారు. అయితే గాయాల నుండి కోలుకున్న తరువాత వ్యాయామాశాలకు వెళ్ళే వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నార. శరీరంలోని గాయపడిన భాగంపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. తిరిగి వ్యాయామం చేయటం వల్ల ఇప్పటికే గాయమైన ప్రాంతంపై ప్రభావం పడుతుందనకుంటే వ్యాయామ దినచర్యపై పునరాలోచన చేయటం మంచిది.

గాయం తర్వాత వ్యాయామశాలకు తిరిగి వెళ్లడం లేదా శిక్షణకు తిరిగి వెళ్లడం కష్టంగా ఉన్నా ఒంటరిగా చేయడం అసాధ్యమైన వైద్య నిపుణులు , జిమ్ ట్రైనర్ సహాయం పొందడం ఉత్తమ ఆలోచన. సమస్య ఉన్న ప్రదేశాన్ని సురక్షితంగా నయం చేయటానికి , ఇబ్బంది కలగని వ్యాయామాలకు వారిచ్చే సూచనలు, సలహాలు దోహదపడతాయి.

READ ALSO : Back Pain : ఈ వ్యాయామాలు నడుమునొప్పితో పాటు కండరాల నొప్పులను తగ్గిస్తాయ్!

ప్రాథమిక వ్యాయామాల నుండి ప్రారంభించటంతోపాటు, తక్కువ బరువు గల వాటిని ప్రయత్నించాలి. వ్యాయామశాలలో నిర్లక్ష్యంగా ఉండకుండా శిక్షకుడి మాట వింటూ తదనుగుణంగా నచుడుకోవాలి. సరైన కండరాలపై దృష్టి పెట్టడంలో మీకు సహాయపడే ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. ఆ వ్యాయామాలు గాయాలను త్వరగా నయం చేయడంలో కూడా సహాయపడతాయి. అలాంటి వ్యాయామాలను నిపుణులు మాత్రమే వాటిని మీకు సూచించగలరు.

READ ALSO : Daily Exercises : చక్కెర స్ధాయిలను అదుపులో ఉంచే రోజువారి వ్యాయామాలు! నడకతోపాటుగా, సైక్లింగ్ మంచిదే?

తాత్కాలిక గాయాలు తీవ్రమైనవి అయినప్పటికీ అవి తగ్గుముఖం పట్టేందుకు కొన్ని వ్యాయామాలు దోహదపడతాయి. మానవ శరీరం గాయాలను నిర్వహించడానికి మరియు త్వరగా నయం చేయడానికి గమనించవలసిన విషయం ఏమిటంటే, శరీరానికి సరైన మొత్తంలో విశ్రాంతి, మంచి ఆహారం, కొన్ని సమయాల్లో ఫిజియోథెరపీటిక్ వ్యాయామాలు అవసరం అవుతాయి. నిపుణులు సైతం వీటిని సిఫార్సు చేస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా గాయం మరింత క్లిష్టతరం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, నిపుణుల సూచనలను అనుసరించడం ఉత్తమం.