TSPSC JOBS : టీఎస్ ప్రజారోగ్య శాఖలో ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీ
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రజారోగ్య ప్రయోగశాలలో ఖాళీ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి మొత్తం 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

Tspsc Jobs
TSPSC JOBS : తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రజారోగ్య ప్రయోగశాలలో ఖాళీ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి మొత్తం 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హతలకు సంబంధించి బీఎస్సీ( ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్, వెటర్నరీ సైన్సెస్, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ) లేదా కెమిస్ట్రీలో పీజీ , మెడిసిన్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఆగస్టు 26, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.tspsc.gov.in/ పరిశీలించగలరు.