RCFL JOBS : ఆర్ సీఎఫ్ఎల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల వయసు 34 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40000 నుండి రూ.1,40,000 వేతనంగా అందిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేది 2022, జులై 23కాగా, దరఖాస్తులకు చివరి తేదీ 2022, ఆగస్టు 12గా నిర్ణయించారు.

RCFL JOBS : ఆర్ సీఎఫ్ఎల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Rcfl

Updated On : July 23, 2022 / 9:22 PM IST

RCFL JOBS : భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి మార్కెటింగ్ ఆఫీసర్ ఖాళీలుగా పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే కనీసం 60 శాతం మార్కులతో రెగ్యులర్‌ అండ్‌ ఫుల్‌ టైం సైన్స్‌,ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేషన్‌, పీజీ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

అభ్యర్ధుల వయసు 34 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40000 నుండి రూ.1,40,000 వేతనంగా అందిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేది 2022, జులై 23కాగా, దరఖాస్తులకు చివరి తేదీ 2022, ఆగస్టు 12గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.rcfltd.com/ పరిశీలించగలరు.