SAIL Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్/కెమికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Recruitment of job vacancies in Steel Authority of India Limited
SAIL Recruitment : భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్/కెమికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గేట్ 2022లో వ్యాలిడ్ స్కోర్ కూడా సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.
గేట్ 2022 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.50,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు నవంబర్ 23, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.sail.co.in/en/home పరిశీలించగలరు.