Karnataka Bank Recruitment
Karnataka Bank Recruitment : దేశ వ్యాప్తంగా కర్ణాటక బ్యాంక్ తమ శాఖలలో ఖాళీగా ఉన్న పీవో పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ (జనరల్ బ్యాంకింగ్), అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (AFO) , లా ఆఫీసర్,మార్కెటింగ్ ఆఫీసర్ వంటి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Guava Plantations : పెరిగిన జామతోటల విస్తీర్ణం.. తగ్గిన లాభాలు
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా విభాగంలో పీజీ డిగ్రీ/ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్)/ డిగ్రీ (లా)/ ఎంబీఏ (మార్కెటింగ్/ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయసు 28 సంవత్సరాలకు మించకూడదు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఏడాది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. నెలకు వేతనంగా అన్ని భత్యాలు కలపి లక్షరూపాయల వరకు ఉంటుంది.
READ ALSO : IndiGo pilot collapses : నాగపూర్ విమానాశ్రయంలో గుండెపోటుతో ఇండిగో పైలట్ మృతి
అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు ఆగస్టు 26, 2023 చివరితేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ibpsonline.ibps.in/