IIITT Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీచింగ్ పోస్టుల భర్తీ

అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను డిసెంబర్‌ 2, 2022వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. రాత పరీక్ష, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.

IIITT Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీచింగ్ పోస్టుల భర్తీ

Recruitment of teaching posts in Indian Institute of Information Technology

Updated On : November 2, 2022 / 9:11 PM IST

IIITT Recruitment : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్‌ అనుభవం కలిగి ఉండాలి. యూజీసీ నెట్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ సాధించి ఉండాలి.

అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను డిసెంబర్‌ 2, 2022వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. రాత పరీక్ష, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.70,900ల నుంచి రూ.1,59,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తులను పంపాల్సిన అడ్రస్: రిజిస్ట్రార్ (I/C) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తిరుచిరాపల్లి సేతురపట్టి, ఓపెన్- మధురై హైవే, తిరుచిరాపల్లి, తమిళనాడు-620012. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://iiitt.ac.in/ పరిశీలించగలరు.