Cm Revanth Aerial Survery: జల విలయం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే..
సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్, డీజీపీ ఉన్నారు.

Cm Revanth Aerial Survery: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే జరుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఏరియల్ సర్వే తర్వాత కామారెడ్డిలో వరదలపై సమీక్షించనున్నారు. ఏరియల్ సర్వేలో సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్, డీజీపీ ఉన్నారు.
పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి.
పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ పరిశీలించారు. భారీ వర్షాలకు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. ఇన్ ఫ్లో 7 లక్షల 30వేల క్యూసెక్కులు కాగా అదే స్థాయిలో ఔట్ ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉన్న ఎత్తిపోతలకు కీలకం. కామారెడ్డిలో ఉన్న నిజాంసాగర్, ఇతర ప్రాజెక్టులను సీఎం రేవంత్ పరిశీలించబోతున్నారు.
ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, ఏ ప్రాంతంలో ఎంత డ్యామేజ్ జరిగింది అనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు సీఎం రేవంత్. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, నిజాం సాగర్ అప్పర్ మానేరు ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. మిడ్ మానేరు సైతం నిండు కుండను తలపిస్తోంది.
Also Read: వర్షం కలిపింది ఇద్దరినీ.. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆలింగనం చేసుకున్న బండి సంజయ్, కేటీఆర్..