Replacement : సీఐఐఎల్ లో ఒప్పంద పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Ciil Mysur

Replacement : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన మైసూర్ లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజస్ (సిఐఐఎల్) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను పరిశీలిస్తే అకడమిక్ పోస్టుల్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ 1, డైరెక్టర్ 1, సీనియర్ ఫెలో 5, అసోసియేట్ ఫెలో 10 ఖాళీలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు సంబంధించి ఆఫీస్ సూపరింటెండెంట్ 1, జేఏఓ 1, యూడీసి 1, ఎల్డీసీ 1, ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ WWW.ciil.org/ సంప్రదించగలరు.