SBI Clerk Recruitment 2024 : ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్.. 13,735 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు వివరాలివే..!

SBI Clerk Recruitment 2024 : ఆసక్తి గల దరఖాస్తుదారులు అధికారిక ఎస్బీఐ వెబ్‌సైట్ (sbi.co.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 17, 2024న ప్రారంభమవుతుంది.

SBI Clerk Recruitment 2024 : ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్.. 13,735 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు వివరాలివే..!

SBI Clerk Recruitment 2024

Updated On : December 17, 2024 / 5:50 PM IST

SBI Clerk Recruitment 2024 : ప్రముఖ దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆసక్తి గల దరఖాస్తుదారులు అధికారిక ఎస్బీఐ వెబ్‌సైట్ (sbi.co.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 17, 2024న ప్రారంభమవుతుంది. జనవరి 7, 2025 వరకు ఓపెన్ అయి ఉంటుంది.

అర్హత ప్రమాణాలు :
జూనియర్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించిన సమానమైన అర్హతను కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD)ని కలిగి ఉన్నవారు తప్పనిసరిగా తమ డిగ్రీని డిసెంబర్ 31, 2024లోపు పూర్తి చేయాలి.

ఎస్బీఐ క్లర్క్ దరఖాస్తుదారులు :
తప్పనిసరిగా ఏప్రిల్ 1, 2024 నాటికి 20 ఏళ్లు, 28 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఏప్రిల్ 2, 1996 నుంచి ఏప్రిల్ 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎస్బీఐ క్లర్క్ 2024 రిక్రూట్‌మెంట్ : ఎలా దరఖాస్తు చేయాలి? :

1. ఎస్బీఐ (sbi.co.in/careers)లో అధికారిక కెరీర్ పేజీని విజిట్ చేయండి.
2. “Latest Announcements” లేదా “జూనియర్ అసోసియేట్స్ (క్లార్క్) రిక్రూట్‌మెంట్” నోటిఫికేషన్‌ను గుర్తించండి.
3. ‘Apply Online’పై క్లిక్ చేయండి.
4. ‘New Registration’ని ఎంచుకుని, పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను ఎంటర్ చేయండి.
5. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
6. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించండి.
7. ‘ఫైనల్ సబ్మిట్’ క్లిక్ చేసే ముందు అన్ని వివరాలను రివ్యూ చేయండి.
8. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 7, 2025
ప్రిలిమినరీ పరీక్ష : ఫిబ్రవరి 2025న షెడ్యూల్ (తాత్కాలికం)
మెయిన్స్ పరీక్ష : మార్చి/ఏప్రిల్ 2025లో షెడ్యూల్ (తాత్కాలికం)

ఎంపిక ప్రక్రియ :
ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, అలాగే ఎంచుకున్న లోకల్ లాంగ్వేజీ పరీక్ష, ప్రిలిమినరీ పరీక్షలో ఒక గంట వ్యవధితో మొత్తం 100 మార్కుల ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి.

పే స్కేల్ :
క్లరికల్ కేడర్‌కు సంబంధించిన పే స్కేల్ రూ. 24,050 నుంచి రూ. 61,480 వరకు ఉంటుంది. ప్రారంభ ప్రాథమిక వేతనం రూ. 26,730గా ఉంటుంది. ఇందులో గ్రాడ్యుయేట్‌లకు వర్తించే రూ. 24,050, రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్‌లు ఉన్నాయి.

Read Also : Aadhaar Update Deadline : ఆధార్ అప్‌డేట్ గడువు మళ్లీ పొడిగింపు.. ఈ తేదీ వరకు ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు!