Aadhaar Update Deadline : ఆధార్ అప్‌డేట్ గడువు మళ్లీ పొడిగింపు.. ఈ తేదీ వరకు ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు!
Aadhaar Update Deadline : ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌ల కోసం ప్రారంభ గడువు డిసెంబర్ 14 అయితే, దశాబ్ద కాలంగా అప్‌డేట్ చేసుకోని వారికోసం ప్రభుత్వం ఆధార్ అప్‌డేట్‌ను మరోసారి గడువును పొడిగించింది.

Aadhaar update deadline extended again
Aadhaar Update Deadline : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ (myAadhaar) ద్వారా ఫ్రీ ఆధార్ అప్‌డేట్స్ కోసం మరోసారి గడువును పొడిగించింది. భారతీయ నివాసితులు ఇప్పుడు తమ ఆధార్ కార్డ్‌లపై వివరాలను జూన్ 14, 2025 వరకు అప్‌డేట్ చేయవచ్చు.
ఫ్రీ ఆధార్ అప్‌డేట్‌ల కోసం ప్రారంభ గడువు డిసెంబర్ 14 అయితే, ఆధార్ హోల్డర్‌లు, ముఖ్యంగా దశాబ్ద కాలంగా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోని వారికోసం ప్రభుత్వం ఆధార్ అప్‌డేట్ గడువును పొడిగించింది.
అయితే, ఈ ఫ్రీ సర్వీసు ఆన్‌లైన్‌లో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి జనాభా సమాచారాన్ని అప్‌డేట్ చేసేందుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫింగర్‌ఫ్రింట్స్, ఐరిస్ స్కాన్‌లు లేదా ఫొటోగ్రాఫ్‌ల వంటి బయోమెట్రిక్‌లలో ఏవైనా మార్పులు చేయడానికి ఆధార్ హోల్డర్‌లు అధీకృత ఆధార్ కేంద్రాలను సందర్శించి, వివరాలను అప్‌డేట్ చేసేందుకు నామమాత్రపు రుసుమును చెల్లించాలి.
ముఖ్యంగా, వయస్సు, శస్త్రచికిత్స, ప్రమాదాలు లేదా ఇతర పరిస్థితుల కారణంగా బయోమెట్రిక్‌లు మారిన వ్యక్తులకు బయోమెట్రిక్ అప్‌డేట్స్ తప్పనిసరి. 15 ఏళ్లు నిండిన మైనర్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే.. డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాలి.
ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
- మీరు ఫ్రీ ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్ సర్వీసును పొందాలనుకుంటే..
- (myAadhaar) పోర్టల్‌ని విజిట్ చేయండి.
- మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఉపయోగించి లాగిన్ చేయండి.
- మీ ఆధార్‌లో పేరు, అడ్రస్ సహా అన్ని వివరాలను చెక్ చేసి ధృవీకరించండి.
- ఏవైనా దిద్దుబాట్లు అవసరమైతే, అప్‌డేట్ చేసుకోండి.
- అప్‌డేట్ చేయడానికి సంబంధిత డాక్యుమెంట్ టైప్ ఎంచుకోండి.
- (ఉదా.. గుర్తింపు లేదా అడ్రస్ ప్రూఫ్ ) క్లియర్ స్కాన్ చేసిన కాపీని JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి (గరిష్ట ఫైల్ సైజు : 2 MB).
- మీ అప్‌డేట్ రిక్వెస్ట్ సమర్పించండి.
- ట్రాకింగ్ బెనిఫిట్స్ కోసం 14-అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని నోట్ చేసుకోండి.
- ఆమోదించిన తర్వాత అప్‌డేట్ ఆధార్ కార్డును నేరుగా పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్‌ను అప్‌డేట్ ఎందుకు ముఖ్యమంటే? :
యూఐడీఏఐ నిలకడగా ఆధార్ వివరాలను కచ్చితంగా అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. భారత ప్రభుత్వం జారీ చేసిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నమోదు చేయడం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం, ప్రయాణ టిక్కెట్‌లను బుక్ చేయడం మొదలైన వాటితో సహా అనేక సేవలు, ప్రయోజనాలను పొందేందుకు చాలా అవసరం.
అదనంగా, ఆధార్‌కు రెగ్యులర్ అప్‌డేట్‌లు ఆధార్ హోల్డర్‌కి లింక్ చేసిన సమాచారం కచ్చితత్వాన్ని నిర్ధారిస్తాయి. దుర్వినియోగం, మోసం, గుర్తింపు సంబంధిత లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దశాబ్దం క్రితం జారీ చేసిన ఆధార్ కార్డులు లేదా 15 ఏళ్లు నిండిన మైనర్‌లు, ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని, వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ ఆధార్ హోల్డర్‌లను ప్రోత్సహిస్తుంది.