Singareni Junior Assistant Exams : సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల

సింగరేణి జూనియర్ అసిస్టెంట్‌ రాత పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం (సెప్టెంబర్10,2022)న పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్‌, సింగరేణి డైరెక్టర్‌ విడుదల చేశారు. పరీక్ష నిర్వహించిన వారంల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు సింగరేణి డైరెక్టర్‌ తెలిపారు.

Singareni Junior Assistant Exams : సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల

Singareni Junior Assistant Exams

Updated On : September 10, 2022 / 8:36 PM IST

Singareni Junior Assistant Exams : సింగరేణి జూనియర్ అసిస్టెంట్‌ రాత పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం (సెప్టెంబర్10,2022)న పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్‌, సింగరేణి డైరెక్టర్‌ విడుదల చేశారు. పరీక్ష నిర్వహించిన వారంల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు సింగరేణి డైరెక్టర్‌ తెలిపారు. సింగరేణి వెబ్‌సైట్‌ www.scclmines.comలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఉంచినట్లు అధికారులు తెలిపారు.

117 పోస్టుల కోసం 49,328 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్కులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వారం రోజుల్లోనే ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితా విడుదల చేస్తామన్నారు.

NABARD Vacant Posts : నాబార్డ్‌లో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్ ఖాళీ పోస్టులు భర్తీ

ఇదిలావుంటే సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్షను ఈ నెల 4న నిర్వహించిన విషయం తెలిసిందే. 117 పోస్టులకు 99,882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 77,907 మంది పరీక్షకు హాజరయ్యారు.