అప్లై చేశారా : సౌత్ రైల్వేలో 3585 అప్రెంటిస్ పోస్టులు

చెన్నై ప్రధాన కేంద్రంగా సదరన్ రైల్వేలో 3 వేలకు పైగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన అభ్యర్ధులకు మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
విభాగాల వారిగా ఖాళీలు :
క్యారేజ్ వర్క్స్ : 1208
సెంట్రల్ వర్క్ షాప్ : 723
సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ వర్క్ షాప్ – 1654
విద్యార్హత : 10th, ITI
(అభ్యర్దులు 10th తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటిఐ చదివి ఉండాలి. ఎంఎల్ టీ పోస్టులకు ఇంటర్ లో బైపీసీ చదివి ఉండాలి)
వయోపరిమితి : 15-24సంవత్సరాలు
(15 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి. SC,ST, ఓబిసీ ,దివ్యాంగులకు వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది)
దరఖాస్తు ఫీజు : జనరల్ . ఓబిసీ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. SC, ST , దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులకు మాత్రం ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 01,2019
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 31,2019