SSC Recruitment 2025: బిగ్ అప్డేట్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 1340 పోస్టులు.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది.

staff selection commission recruitment 2025
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://ssc.nic.in/ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జులై 21న ముగియనుంది.
ఎస్ఎస్సీ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల సమర్పణ తేదీలు: జూన్ 30 నుంచి జులై 21 వరకు.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: జులై 22 వరకు ఉంటుంది
దరఖాస్తు ఫారమ్ సవరణ: ఆగస్టు 1 నుంచి 2 ఓపెన్ ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I): అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఉండే అవకాశం ఉంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-II): జనవరి-ఫిబ్రవరి, 2026 లో ఉండే అవకాశం ఉంది.
దరఖాస్తులో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా సంప్రదించాల్సిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 180 030 93063.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి వివిధ పోస్టులకు వేరువేరుగా ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ100. మహిళా అభ్యర్థులు,ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుంది.