జేఈ ఫలితాల్లో ‘సన్నీ లియోన్’ టాపర్

సన్నీలియోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) మెరిట్ లిస్టులో టాపర్ గా నిలిచింది. అదేంటీ.. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సన్నీలియోన్ సినిమాలు మానేసి జేఈ పోస్టుకు ఆప్లయి చేసిందా? అని షాక్ అయ్యారా?

  • Published By: sreehari ,Published On : February 21, 2019 / 12:13 PM IST
జేఈ ఫలితాల్లో ‘సన్నీ లియోన్’ టాపర్

సన్నీలియోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) మెరిట్ లిస్టులో టాపర్ గా నిలిచింది. అదేంటీ.. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సన్నీలియోన్ సినిమాలు మానేసి జేఈ పోస్టుకు ఆప్లయి చేసిందా? అని షాక్ అయ్యారా?

సన్నీలియోనీ జూనియర్ ఇంజినీర్ (జేఈ) మెరిట్ లిస్టులో టాపర్ గా నిలిచింది. అదేంటీ.. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సన్నీలియోన్ సినిమాలు మానేసి జేఈ పోస్టుకు ఆప్లయి చేసిందా? అని షాక్ అయ్యారా? నిజానికి జేఈ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది.. సన్నీ లియోనీనే.. కానీ, మీరు అనుకున్నట్టు బాలీవుడ్ సినీ నటి సన్నీ లియోనీ కాదు. బీహార్ కు చెందిన సన్నీ లియోనీ అనే డిప్లొమా ఇంజినీరింగ్ విద్యార్థిని. బీహార్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ (PHED)లో జూనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. జనవరి 15 నుంచి జనవరి 31 వరకు దరఖాస్తు స్వీకరించారు. ఫిబ్రవరి 15న పీహెచ్ ఈ డీ జేపీ మెరిట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలకు సంబంధించిన మెరిట్ జాబితాను PHED వెబ్ సైట్లో ఉంచారు. ఈ ఫలితాల్లో సన్నీ మొత్తం 98.5 పాయింట్లు సాధించింది. ఎకడామిక్స్ నుంచి 73.5 పాయింట్లు, పర్సనల్ ఎక్స్ పీరియన్స్ ఆధారంగా 25 పాయింట్లు సాధించింది. 

సన్నీలియోనీ పేరుతో వచ్చిన దరఖాస్తుపై తండ్రి పేరు.. లియోనా లియోనీ అని ఉంది. ఈ పేరు బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరును పోలి ఉండటంతో వివాదాస్పదంగా మారింది. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దాదాపు 17వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సన్నీ లియోనీ అనే పేరు టాపర్ గా నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సన్నీ లియోన్ పేరుతో ఆన్ లైన్ దరఖాస్తు చేసిన వ్యక్తి నిజంగా ఆ పేరుతో ఉన్నారా? లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఎవరైనా ఆకతాయిలు సరదా కోసం ఇలా దరఖాస్తు చేసి ఉంటారా? అని అధికారులు ఆరా తీస్తున్నారు. బీహార్ పీహెచ్ఈడీ జాయింట్ సెక్రటరీ అశోక్ కుమార్ మాట్లాడుతూ..‘‘అవును. సన్నీ లియోనీ అనే పేరుతో దరఖాస్తు అందిన వార్త వాస్తవమే. 

దరఖాస్తులో తండ్రి పేరు లియోనా లియోనీ అని ఉంది. అభ్యర్థి మే 13, 1991లో జన్మించినట్టుగా ఉంది. అంతేకాదు.. డిప్లొమా ఇంజినీరింగ్ లో 98.5 పాయింట్లతో మెరిట్ లిస్టులో టాపర్ గా నిలిచింది. దరఖాస్తు చేసిన సదరు అభ్యర్థి నిజమా కాదా? ధృవీకరించాల్సి ఉంది. సర్టిఫికేట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి అయ్యాక మాత్రమే ఏం విషయమైనా చెప్పగలం’’ అని చెప్పారు. PHED బీహార్ నోటీసు ప్రకారం.. డ్రాఫ్ట్ మెరిట్ జాబితాలో మార్కులు సాధించిన అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఫిబ్రవరి 24 వరకు తెలపవచ్చు. జీఈ అభ్యర్థులంతా phed.bih.nic.in వెబ్ సైట్లో తమ అభ్యంతరాలను తెలుపవచ్చు. 
Sunny leone

Read Also: ఫిటింగ్ వర్మ : చంద్రబాబు కంటే రానానే రియల్
Read Also:జియో ఎఫెక్ట్ : BSNL డేటా సునామీ ఆఫర్
Read Also:విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?