AIIMS Bilaspur Recruitment 2023
AIIMS Bilaspur Recruitment 2023 : బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ఒప్పంద, రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబధిత విభాగాలలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు నవంబరు 30లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు హార్డ్‌కాపీలను డిసెంబరు 6లోగా సంబంధిత చిరునామాకు పంపాలి.
READ ALSO : Vijayashanti: బీజేపీకి విజయశాంతి రాజీనామా.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి? ఎప్పుడంటే ..
వివరాలు..
మొత్తం టీచింగ్ పోస్టులు ఖాళీల సంఖ్య: 81
ప్రొఫెసర్: 24
అడిషనల్ ప్రొఫెసర్: 14
అసోసియేట్ ప్రొఫెసర్: 16
అసిస్టెంట్ ప్రొఫెసర్: 24
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఒప్పంద ప్రాతిపదికన): 03
READ ALSO : Weather Update : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు
ప్రొఫెసర్ పోస్టులు ;
విభాగాలు: అనస్థీషియా, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ప్రసూతి & గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, బర్న్స్& ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడ్/టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నేత్ర వైద్యం, పీడియాట్రిక్స్ సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, యూరాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులు ;
విభాగాలు: అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, నియోనాటాలజీ, ఫోరెన్సిక్ మెడ్ మరియు టాక్సికాలజీ, జనరల్ సర్జరీ, పాథాలజీ/ల్యాబ్ మెడ్, సైకియాట్రీ, రేడియాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Kedarnath Temple : శీతాకాలం దృష్ట్యా కేదార్ నాథ్ ఆలయం మూసివేత
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ;
విభాగాలు: బర్న్స్& ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫ్యూజన్, ట్రాన్‌మోనోడియాలజీ, సైకియాలాజీ మెడిసిన్, యూరాలజీ,అసోసియేట్ ప్రొఫెసర్ (ఫ్యాకల్టీ కోడ్ – 003), కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, క్లినికల్ ఇమ్యునాలజీ మరియు రుమటోలో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ;
విభాగాలు: అనస్థీషియా, ఎండోక్రినాలజీ & మెటబాలిజం, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నియోనాటాలజీ, బయోకెమిస్ట్రీ, క్లినికల్ ఇమ్యునాలజీ & రుమటాలజీ (క్లినికల్ సర్వీస్), క్లినికల్ ఇమ్యునాలజీ &రుమటాలజీ (లాబోరేటరీ, సర్వీసెస్) (నాన్-క్లినికల్/నాన్ మెడికల్)డెర్మటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ప్రసూతి & గైనకాలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, రేడియాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : ఫేస్‌బుక్‌లో వాట్సాప్ స్టేటస్ షేరింగ్ ఇలా..
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) పోస్టులు ;
విభాగాలు: అనస్థీషియా, న్యూరాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హత:
సంబంధిత విభాగాలలో డిగ్రీ, పీజీతో పాటు అభ్యర్థి తప్పనిసరిగా స్టేట్ మెడికల్ కౌన్సిల్/MCI/NMCలో రిజిస్టర్ అయి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
ప్రొఫెసర్/అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 58 సంవత్సరాలు, డిప్యుటేషన్- 56 సంవత్సరాలు, రిటైర్డ్ ఫ్యాకల్టీ- 70 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ 50 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తుంది.
READ ALSO : Chandrababu : చంద్రబాబుకు గుండె సమస్య, 5 వారాల రెస్ట్ అవసరం.. హైకోర్టుకు హెల్త్ రిపోర్టు అందజేత
దరఖాస్తు ఫీజు:
జనరల్- రూ.2,360, ఎస్సీ/ఎస్టీ- రూ.1,180, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వేతనం:
ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,68,900 నుండి 2,20,400, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,48,200 నుండి 2,11,400, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,38,300 నుండి 2,09,200, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,01,500 నుండి 1,67,400, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఒప్పంద ప్రాతిపదికన) పోస్టులకు రూ.1,01,500 మరియు NPA + DA చెల్లిస్తారు.
READ ALSO : Janasena : జనసేనలో భగ్గుమన్న విభేదాలు, తల పట్టుకున్న టీడీపీ నేతలు
ముఖ్యమైన తేదీలు ;
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ 30.11.2023గా నిర్ణయించారు.
దరఖాస్తు హార్డు కాపీలను పంపేందుకు చివరితేదీ 06.12.2023గా నిర్ణయించారు.
దరఖాస్తు హార్డు కాపీలను పంపాల్సిన చిరునామా: Deputy Director (Administration), Administrative Block, 3rd Floor, All India Institute of Medical Sciences, Kothipura, Bilaspur,Himachal Pradesh-174037.
పూర్తి వివరాలకు https://www.aiimsbilaspur.edu.in/ పరిశీలించగలరు.