Janasena : జనసేనలో భగ్గుమన్న విభేదాలు, తల పట్టుకున్న టీడీపీ నేతలు

Clashes Between Janasena Leaders : వారిని నిలువరించేందుకు టీడీపీ నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మొదటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

Janasena : జనసేనలో భగ్గుమన్న విభేదాలు, తల పట్టుకున్న టీడీపీ నేతలు

Clashes Between Janasena Leaders

Updated On : November 15, 2023 / 7:42 PM IST

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. జనసేన నేతలు గోపి, పరుచూరి భాస్కరరావు వర్గాల మధ్య విభేదాలు సమన్వయ సమావేశం సాక్షిగా భగ్గుమన్నాయి. చిన్నగా మొదలైన వాగ్వాదం తోపులాట వరకు దారితీసింది. వారిని నిలువరించేందుకు టీడీపీ నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మొదటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఈ రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అప్పుడు పెద్ద గొడవే జరిగింది.

అనకాపల్లి ఉప్పల చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో టీడీపీ-జనసేన సమన్వయ భేటీ జరిగింది. ఈ భేటీలో జనసేన నేతలు గోపి, పరచూరి భాస్కరరావు వర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పరచూరి భాస్కరరావు వర్గంపై గోపి వర్గం మండిపడింది. వీళ్లను నిలువరించేందుకు టీడీపీ నేతలు ఇబ్బంది పడ్డారు.

Also Read : చంద్రబాబుకు గుండె సమస్య, 5 వారాల రెస్ట్ అవసరం.. హైకోర్టుకు హెల్త్ రిపోర్టు అందజేత

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన ఏకమైన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం నేతలు కృషి చేస్తున్నారు. అయితే పలు చోట్ల పార్టీలో ఉన్న వర్గ విభేదాలు, గ్రూపు తగాదాలు తలనొప్పిగా మారుతున్నాయి. ఒకే పార్టీలో ఉంటున్నా ఆధిపత్య పోరుతో నాయకులు ఘర్షణ పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇలా అయితే అనుకున్న లక్ష్యం సాధించడం కష్టం అవుతుందని వాపోతున్నారు.

Also Read : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజులు రిమాండ్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు