DOST 2025 Update: దోస్త్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ గడువు పొడగింపు.. పూర్తి వివరాలు మీకోసం
DOST 2025 Update: రిజిస్ట్రేషన్ల గడువు జూలై 31గా నిర్ణయించారు. కానీ, తాజాగా ఈ గడువు తేదీని మరోసారి పొడిగించారు. ఈమేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

Telangana DOST 2025 Final Phase Registration Deadline Extended
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు విడతలు ప్రెవేశాలు పూర్తవగా.. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం కోసం ఇటీవల స్పెషల్ ఫేజ్ ను ప్రకటించారు అధికారులు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు జూలై 31గా నిర్ణయించారు. కానీ, తాజాగా ఈ గడువు తేదీని మరోసారి పొడిగించారు. ఈమేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. పొడగించిన తేదీ ప్రకారం అభ్యర్థులు ఆగస్ట్ 2వ తేదీ అంటే రేపటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ ఫేస్ కి సంబంధించిన సీట్ల కేటాయింపు ఆగస్ట్ 6వ తేదీన ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది, అలాగే స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందే వారికి స్కాలర్ షిప్స్ అవకాశం ఉండదు.
రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి:
- విద్యార్థులు ముందుగా దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో క్యాడెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- తరువాత మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
- చివరల్లో ఆధార్ అథంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- ఇప్పుడు దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
- దీని ద్వారా లాగిన్ అవ్వాలి.
- మీరు ఎంటర్ చేసిన లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
- ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి.